జగన్‌తో అనుబంధం తెగిపోయేది కాదు.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత

Breaking News: జగన్‌తో తనకున్న సంబంధం, మామ, అల్లుళ్ల మధ్య ఉన్న సంబంధమని, ఆయన తనకు మేనల్లుడిలాంటి వాడని కేవీపీ తెలిపారు. తమ అనుబంధం వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: May 21, 2019, 2:08 PM IST
జగన్‌తో అనుబంధం తెగిపోయేది కాదు.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటోలు)
  • Share this:
వైఎస్ఆర్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తన అనుబంధం తెగిపోయేది కాదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రారావు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కేవీపీ.. జగన్‌తో తనకున్న సంబంధం, మామ, అల్లుళ్ల మధ్య ఉన్న సంబంధమని, ఆయన తనకు మేనల్లుడిలాంటి వాడని తెలిపారు. తమ అనుబంధం వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ పుట్టకముందు నుంచే తాను వైఎస్‌తో కలిసి ఉన్నానని అన్నారు. జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని, యూపీఏలో జగన్‌ను కలపాలని తనను అధిష్టానం కోరలేదని.. ఒకవేళ ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తే, నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

యూపీఏ గానీ, కాంగ్రెస్ గానీ, జగన్కు సీట్లు పెరిగితే తమతో కలుపుకోవాలని చూస్తున్నాయన్న సంగతి తనకు తెలియదని అన్నారు. ప్రస్తుతం తాను జగన్‌తో ఎందుకు లేనన్న విషయాన్ని బహిరంగంగా చెప్పలేనని, దాని గురించి చర్చించే సమయం ఇది కాదని వివరించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 21, 2019, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading