కాంగ్రెస్‌కు ఝలక్.. ప్రధాని మోదీతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ..

అనుకున్నట్లుగానే కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా భారీ ఝలక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రధాని మోదీని కలిశారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు.

news18-telugu
Updated: March 10, 2020, 11:15 AM IST
కాంగ్రెస్‌కు ఝలక్.. ప్రధాని మోదీతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ..
జ్యోతిరాదిత్య సింధియా
  • Share this:
అనుకున్నట్లుగానే కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా భారీ ఝలక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రధాని మోదీని కలిశారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రధానిని కలిశారు. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయం అత్యంత ఆసక్తిగా మారింది. అటు.. బీజేపీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సింధియాకు మద్దతుగా 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్టుల్లో మకాం వేశారు. వీరంతా బీజేపీకి మద్దతు తెలిపితే.. కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ సభ్యులు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మెజారిటీ మార్కు 115 అనుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశాలు లేనట్లే.


ఈ నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోతుంది. అదే సమయంలో... బీజేపీ 107 మందితోపాటూ 17 మంది మద్దతు పొందితే ఈజీగా అధికారంలోకి వస్తుంది. ఇదిలా ఉండగా, సింధియాకు బీజేపీ రాజ్యసభ సీటును ఎరవేసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. దీని వెనక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నట్లు తెలిసింది.

Published by: Shravan Kumar Bommakanti
First published: March 10, 2020, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading