news18-telugu
Updated: December 10, 2019, 4:59 PM IST
జీవన్ రెడ్డి (File)
దిశ కేసుపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దిశ ఘటన కేసుపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ కేసుతో పాటు అన్ని కేసులపై స్వతంత్ర విచారణ సంస్థ సిట్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక్క దిశ కేసు కోసం మాత్రమే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కాకుండా అన్ని కేసులకు సంబంధించి శాశ్వత ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. దిశకు జరిగిన అన్యాయంపై స్పందిస్తూ దిశ కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించగానే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, పోలీస్ నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు కేవలం అధికార పార్టీ నేతలకు సేవల చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఆ పార్టీ నేతల సేవల్లో తరిస్తున్నారని విమర్శించారు.
కాగా, ప్రభుత్వ వైఫల్యాలకు, పాపాలకు ఎన్కౌంటర్ పరిష్కారం కానేకాదని జీవన్ రెడ్డి అన్నారు. అటు.. రాష్ట్రంలో మద్యం ఆదాయ మార్గంగా ప్రభుత్వం మరింత ప్రోత్సహించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
December 10, 2019, 4:59 PM IST