Home /News /politics /

CONGRESS LEADER JANAREDDY SON GIVES CLARITY OVER PARTY CHANGE NS

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జానారెడ్డి కుమారుడు.. ఆయన ఏమన్నారంటే..

జానారెడ్డి (ఫైల్ ఫొటో)

జానారెడ్డి (ఫైల్ ఫొటో)

మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి(Congress Leader Jana Reddy), ఆయన కుమారుడు రఘువీర్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తలపై జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

ఇంకా చదవండి ...
    నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగడం అనివార్యంగా మారింది. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో దూకుడు మీద ఉన్న భారతీయ జనతాపార్టీ నాగార్జునసాగర్ లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అయితే అక్కడ బలమైన నేతగా ఉన్న మాజీ సీఎల్పీ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకుని బలాన్ని పెంచుకోవాలని కమలం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు జానారెడ్డితో సంప్రదింపులు జరిపారని సైతం వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

    అయితే ఈ వార్తలపై జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి స్పందించారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. నోముల నర్సింహయ్య సంతాప దినాలు ముగిసేవరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. తన తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని రఘువీర్ రెడ్డి అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించిన రోజు నుంచే ఉప ఎన్నికలు, గెలుపుపై వివిధ రాజకీయ పార్టీల నేతలు రకరకాలుగా విషప్రచారానికి తెర తీయడం భాదాకరం అని అన్నారు.

    నోముల సంతాప దినాలు ముగిసే వరకు రాజకీయాలు పక్కకు పెట్టాలని రఘువీర్‌ రెడ్డి కోరారు. విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతగా తాను కోరేది ఇది ఒక్కటే అని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తాను పార్టీ మారుతున్నానని దిగజతారుడు రాజకీయాలకు పాల్పడుతూ విష ప్రచారం చేయిస్తున్నాయని మండిపడ్డారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలను పట్టించుకోవద్దని రఘువీర్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad - GHMC Elections 2020, Jana reddy, Nagarjuna sagar, Nagarjuna Sagar By-election, Telangana bjp, Tpcc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు