పీసీసీ చీఫ్‌ పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. పైరవీలు చేయలేను..

జగ్గారెడ్డి (File- credit - twitter)

చాలా మంది నాయకులు ప్యాంట్‌, షర్ట్‌ వేసుకున్నాక రాజకీయాల్లోకి వచ్చారని.. తాను నిక్కరు వేసుకున్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.

 • Share this:
  తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవిపై నేతల మధ్య పోటీ పెరుగుతోంది. ఉత్తమ్‌ తర్వాత ఆ పదవి ఎవరికి తగ్గుందన్న దానిపై కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డితో పాలు పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ పదవిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని సంగారెడ్డి కోరారు. పీసీసీ అవకాశం ఇస్తే సీనియర్‌ నాయకుల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు.

  పీసీసీ కోసం నేను ఢిల్లీ వెళ్లి పైరవీలు చేయలేను. మీడియా ద్వారా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి విజ్ఞప్తి చేస్తున్నా. సెకండ్‌ లీడర్‌షిప్‌, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తా. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్షేత్రస్థాయిలో తిరుగుతా. అవసరమైతే గ్రామాల్లోనూ పర్యటిస్తా. నా ప్రకటనలతో ఎవరూ అయోమయానికి గురికావొద్దు. నా ప్రతి ప్రకనటకు ఒక వ్యూహం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది.
  జగ్గారెడ్డి


  తన వ్యక్తిత్వం తెలియక కొందరు సోషల్‌మీడియాలో టీఆర్ఎస్ కోవర్టునని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. చాలా మంది నాయకులు ప్యాంట్‌, షర్ట్‌ వేసుకున్నాక రాజకీయాల్లోకి వచ్చారని.. తాను నిక్కరు వేసుకున్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.

  నాపై విమర్శలు, అసత్య ప్రచారం చేసేవారి పేర్లు, ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలని.. తానే స్వయంగా వారి ఇంటికి వెళ్లి అనుమానాలు నివృత్తి చేస్తానని చెప్పారు జగ్గారెడ్డి.
  Published by:Shiva Kumar Addula
  First published: