కాషాయం కట్టుకుని ఆలయాల్లో రేప్‌లు...కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

news18-telugu
Updated: September 17, 2019, 6:18 PM IST
కాషాయం కట్టుకుని ఆలయాల్లో రేప్‌లు...కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(ఫైల్ ఫోటో)
  • Share this:
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్... మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. కొందరు కాషాయం కట్టుకుని దేవాలయాల్లోనే అత్యాచారాలకు పాల్పడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అలాంటి వాళ్లే విభూది అమ్ముతున్నారని కామెంట్ చేశారు. అలాంటి వారి దేవుడు కూడా క్షమించబోడని అన్నారు. భోపాల్‌లో జరిగిన సాధువుల సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ నినాదాన్ని కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం హైజాక్ చేశారని దిగ్విజయ్ ఆరోపించారు.

అసలు జై శ్రీరామ్ నినాదం జై సీతారామ్ నినాదమని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్యాత్మిక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి సాధువులు తరలివచ్చారు. నర్మదా మందాకిని ట్రస్ట్ చైర్మన్ కంప్యూటర్ బాబా ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సమక్షంలోనే దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading