news18-telugu
Updated: May 12, 2020, 4:29 PM IST
జగన్, కేసీఆర్, భట్టి విక్రమార్క
ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 3టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేస్తామని జివో విడుదల చేసేంత వరకు తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేస్తోందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పోతిరెడ్డిపాడు అంశంలో మాట్లాడుకుని చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం పోతిరెడ్డిపాడు సామర్థ్యం తగ్గిస్తే... ఏపీ ప్రభుత్వం పెంచుతూ వెళుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ తగ్గించిన నెలరోజులకు ఏపీ పెంచినట్లు జివో విడుదల చేసిందని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఉండడమే కాకుండా... శబరినదిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోయారని భట్టి విక్రమార్క విమర్శించారు.
కేసీఆర్ తన ఆర్థికపరమైన లావాదేవీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి పై మాకు అనుమానాలు ఉన్నాయని భట్టి విక్రమార్క అన్నారు. గతంలో శబరినది ఇలానే వదిలేశారు కాబట్టి తాము లిగల్గా వెళతామని అన్నారు. జగన్, కేసీఆర్ రోజు మాట్లాడుతున్నారని అంటుంటారని... అలాంటప్పుడు ఇది సీఎం జగన్కు తెలియకుండా జరిగిందా ? అని ఆయన ప్రశ్నించారు. అసలు ఏపీ ప్రభుత్వం జివో విడుదల చేసేంత వరకు తెలంగాణ ఇంటలిజెన్స్ ఏమీ చేస్తోందని అన్నారు. జగన్, కేసీఆర్ మాట్లాడుకుని ఇలా చేయడం లేదనే గ్యారెంటీ ఏంటి అనేది చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
May 12, 2020, 4:29 PM IST