బాలకృష్ణ సినిమాలా ఉండదు... కేసీఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్

సీఎం కేసీఆర్ ఆర్‌ఎంపీ డాక్టర్ లాగా, ఒక భూతవైద్యుడు లాగా సభలో ప్రవర్తిస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు.

news18-telugu
Updated: March 14, 2020, 6:05 PM IST
బాలకృష్ణ సినిమాలా ఉండదు... కేసీఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్
బాలకృష్ణ, కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వైరస్‌ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. బాలకృష్ణ సినిమాలో లాగా తొడగొడితే బిల్డింగులు కూలిపోవడం ఉండదని... సీఎం కేసీఆర్‌ను చూసి కరోనా వైరస్ భయపడి పారిపోదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కరోనా రావాలంటే మమ్మల్ని చూసి గుజ్జునా వణుకుతది అని సీఎం కేసీఆర్ అన్నారని భట్టి అన్నారు. కేసీఆర్ పిట్ట కథలు చెప్పడం మానేయాలని వ్యాఖ్యానించారు. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం కెసిఆర్ మానుకోవాలని సూచించారు. కరోనా రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మాటలు చెప్తే సరిపోదని విమర్శించారు.

సీఎం కేసీఆర్ ఆర్‌ఎంపీ డాక్టర్ లాగా, ఒక భూతవైద్యుడు లాగా సభలో ప్రవర్తిస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. పారసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా రాదు అని సీఎం కేసీఆర్ సభలో ఇంతకు ముందు చెప్పారని గుర్తు చేశారు. కరోనా వైరస్ వచ్చినటువంటి వ్యక్తిని ప్రజా జీవితానికి దూరంగా ఒక ఐసోలేషన్ రూమ్‌లో ఉంచాలని... కానీ దానికి విరుద్ధంగా నగరం నడిబొడ్డున గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఉంచారని మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చడం సిగ్గుచేటని... దీనికి సీఎం కేసీఆర్ వెంటనే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: March 14, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading