అప్పు పెరిగితే రాష్ట్రాన్ని అమ్మేస్తారా ?.. కేసీఆర్‌పై భట్టి ఫైర్

గత ప్రభుత్వాలు ఆర్టీసీని కాపాడేందుకు ఆర్థిక సాయం చేశాయని... కేసీఆర్ మాత్రం ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

news18-telugu
Updated: October 7, 2019, 3:07 PM IST
అప్పు పెరిగితే రాష్ట్రాన్ని అమ్మేస్తారా ?.. కేసీఆర్‌పై భట్టి ఫైర్
భట్టి విక్రమార్క (File)
  • Share this:
ఆర్టీసీకి ఉన్న కొద్దిపాటు అప్పు తీర్చలేక ప్రైవేటు పరంగా చేస్తామని అంటున్న సీఎం కేసీఆర్... అప్పులు పెరిగితే తెలంగాణను కూడా అమ్మేస్తారా ? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ కేసీఆర్‌కు వారసత్వంగా వచ్చిన ఆస్తికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదని చెప్పి తెలంగాణలో ఆర్టీసీని మూసేస్తారా అని మండిపడ్డారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ప్రజారవాణాతో ఆర్టీసీని పోల్చడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఆర్టీసీ కేసీఆర్ పాలన వల్ల కుదేలు అవుతోందని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వాలు ఆర్టీసీని కాపాడేందుకు ఆర్థిక సాయం చేశాయని... కేసీఆర్ మాత్రం ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే వరంగల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కువ బస్సులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్టు తెలుస్తోందని అన్నారు. డీజిల్‌పై పన్ను కారణంగా ఆర్టీసీ ఏటా రూ. 400 కోట్లు నష్టపోతుందని అన్నారు. డీజిల్ పన్ను తగ్గించే అవకాశం ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో ఉందని... ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పూర్తి న్యాయబద్ధమైనవని అన్నారు.

First published: October 7, 2019, 3:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading