కేసీఆర్ అహంకారానికి ఇది పరాకాష్ఠ.. : ఆర్టీసీ సమ్మెపై భట్టి విక్రమార్క

కార్మికులను భయపెట్టి విధుల్లో చేర్చుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు భట్టి. కేసీఆర్ అహంకారానికి ఇది పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాటతో ఉద్యోగాలు పోతాయని బెదిరించడానికి ఇదేమీ రాచరికం కాదన్నారు.

news18-telugu
Updated: October 6, 2019, 2:07 PM IST
కేసీఆర్ అహంకారానికి ఇది పరాకాష్ఠ.. : ఆర్టీసీ సమ్మెపై భట్టి విక్రమార్క
కేసీఆర్, భట్టి విక్రమార్క
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రకటన వచ్చేదాకా సమ్మె విరమించేది లేదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాల మద్దతు కూడా లభిస్తోంది. కాంగ్రెస్,తెలంగాణ జనసమితి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కార్మికుల హక్కుల గురించి మాట్లాడిన కేసీఆర్‌కు.. ఇప్పుడు వారు బరువైపోయారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం సకలజనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్న విషయాన్ని మరిచిపోయారా? అని నిలదీశారు. కార్మికులను భయపెట్టి విధుల్లో చేర్చుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. కేసీఆర్ అహంకారానికి ఇది పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాటతో ఉద్యోగాలు పోతాయని బెదిరించడానికి ఇదేమీ రాచరికం కాదన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, శనివారం సాయంత్రం 6గంటల వరకు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌ను కార్మికులు పట్టించుకోలేదు.ప్రభుత్వం నుంచి గట్టి హామీ లభించేంతవరకు సమ్మె విరమించబోమని చెబుతున్నారు. అటు ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గట్లేదు.

పోలీసు భద్రత నడుమ తాత్కాలిక డ్రైవర్లతో వాహనాలను నడుపుతున్నారు. దీంతో పలుచోట్ల స్వల్ప సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయి.
First published: October 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading