తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్... రూ. 34,000 కోట్లు మిగులుతుందన్న కాంగ్రెస్

తెలంగాణలోని ప్రాజెక్టుల విషయంలోనూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

news18-telugu
Updated: September 24, 2019, 2:43 PM IST
తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్... రూ. 34,000 కోట్లు మిగులుతుందన్న కాంగ్రెస్
భట్టి విక్రమార్క (File)
  • Share this:
ఏపీలోని ప్రాజెక్టుల విషయంలో జరిగిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతించారు. అక్కడ గతంతో పోలిస్తే 12.6 శాతం తక్కువగా మేఘా కంపెనీ టెండర్ వేసిందని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా జ్యూడిషియరీ కమిటీ వేసి టెండరింగ్ పర్యవేక్షణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ లో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురావాలని అన్నారు. తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని... ఇంకా లక్షా ఖర్చు చేయనుందని కాబట్టి రివర్స్ టెండరింగ్ చేపట్టాలని భట్టి విక్రమార్క అన్నారు.

అలా చేస్తే రాష్ట్రానికి రూ. 28 వేల కోట్లు ఆదా అయ్యేదని అన్నారు. మిషన్ భగీరథలోనూ రివర్స్ టెండరింగ్ చేపట్టాలని... అందులో కూడా రూ. 6 వేల కోట్లు ఆదా అయ్యేదని అన్నారు. ఈ రెండు కలిపితే... మొత్తంగా రూ. 34 వేల కోట్లు ఆదా అయ్యేదని అన్నారు. తెలంగాణలో మొత్తం టెండర్ విధానం మీద విచారణ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం సేకరించి సీబీఐ విచారణ కోరుతామని భట్టి విక్రమార్క తెలిపారు.


First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>