హోమ్ /వార్తలు /National రాజకీయం /

మళ్లీ కారెక్కిన అరవింద్‌రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

మళ్లీ కారెక్కిన అరవింద్‌రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

మహాకూటమి నుంచి నేతల వలసలు మొదలయ్యాయి. టిక్కెట్లు దక్కని నేతలు ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.

  సీట్లు దక్కని ఆశావహులు మహాకూటమిపై దుమ్మెత్తిపోస్తున్నారు. నిరసనలు తెలియజేస్తున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నింటిలో ఇదే వాతావరణం కనిపిస్తోంది. కొందరు రెబల్‌గా బరిలో దిగుతుంటే మరికొందరు పార్టీ మారుతున్నారు. తాజాగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గడ్డం అరవింద్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  మంచిర్యాల నుంచి టీఆర్ఎస్ తరపున 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు అరవింద్‌రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010లో జరిగిన ఉపఎన్నికల్లోనూ ఆయనే గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో.. కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దివాకర్ రావు చేతిలో ఓడిపోయారు.

  తాజాగా, మహాకూటమిలో భాగంగా సీటు తనకే వస్తుందని ఆశించిన అరవింద్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు. ప్రేమ్‌సాగర్‌రావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అరవింద్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మళ్లీ టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. అరవింద్‌రెడ్డి చేరిక అధికార టీఆర్ఎస్‌కు ఎంతవరకు లాభిస్తుందో చూడాలి.

  First published:

  Tags: CM KCR, Congress, Mahakutami, Telangana, Telangana Election 2018, Telangana News, Trs

  ఉత్తమ కథలు