అమరావతికి జై కొట్టిన కాంగ్రెస్ ముఖ్యనేత

ఏపీకి మూడు రాజధానులు సాధ్యంకాదని కాంగ్రెస్ జాతీయ నేత, కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ అన్నారు.

news18-telugu
Updated: January 9, 2020, 5:27 PM IST
అమరావతికి జై కొట్టిన కాంగ్రెస్ ముఖ్యనేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీకి మూడు రాజధానులు సాధ్యంకాదని కాంగ్రెస్ జాతీయ నేత, కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ అన్నారు. ఏపీ రాజధానికి అమరావతినే అనువైన ప్రాంతమని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, హైకోర్టు, పాలనా కేంద్రం వేర్వేరు చోట్ల ఏర్పాటు సాధ్యంకాదని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. 1953లో కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుంటూరులో హైకోర్టు సాధ్యపడలేదని ఆయన వెల్లడించారు. అమరావతి విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటన్నది ఇంకా స్పష్టం చేయని తరుణంలో కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ విభజన చట్టం రూపొందించడంలో జైరాం రమేశ్ కీలక పాత్ర పోషించారు.

అమరావతిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మాత్రం... ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేశ్ సైతం అమరావతికే జై కొట్టడంతో... కాంగ్రెస్ నాయకత్వం కూడా రాజధానిగా అమరావతి వైపే మొగ్గు చూపుతుందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: January 9, 2020, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading