ప్రధాని మోదీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు భంగకరం

అమెరికాలో మళ్లీ ట్రంప్ సర్కారు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు.

news18-telugu
Updated: September 23, 2019, 2:17 PM IST
ప్రధాని మోదీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు భంగకరం
ప్రధాని మోదీ, ట్రంప్ అభివాదం (Credit - Twitter - Elias Valverde)
  • Share this:
అమెరికాలోని హౌస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోడీ’ కార్యక్రమంలో ‘ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్’ (మరోసారి ట్రంప్ సర్కారు రావాలి) అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు భంగం కలిగించేవిగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు.మరో దేశపు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా...చాలా ఏళ్లుగా అనుసరిస్తున్న దేశ విదేశాంగ విధానాల మూల సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ ఉల్లంఘించారని ఆరోపించారు. దేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలకు మోదీ వ్యాఖ్యలు భంగం కలిగించేలా ఉన్నాయని అభ్యంతరం చెప్పారు.

అమెరికాతో భారత మైత్రీ సంబంధాలు ఆ దేశ రాజకీయ పార్టీలకు అతీతమైనవిగా వ్యాఖ్యానించారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా మనం సత్సంబంధాలను కొనసాగించాల్సి ఉందన్నారు. అయితే ట్రంప్ తరఫున ప్రధాని మోదీ ప్రచారం చేయడం సరికాదన్నారు. భారత్, అమెరికాలు రెండూ స్వయంప్రతిపత్తి కలిగిక ప్రజాస్వామ్య దేశాలని ఆయన గుర్తుచేశారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...