Home /News /politics /

CONGRESS LAUNCHES YOUTH MANIFESTO FOR POLL BOUND UP PRIYANKA GANDHI HINTS AT BEING PARTY CM FACE PVN

UP Election : ప్రియాంక క్లారిటీ..యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆమే!

యూపీ ఎన్నికల కోసం యూత్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్

యూపీ ఎన్నికల కోసం యూత్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్

Congress's Youth Manifesto : ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి యూత్ మ్యానిఫెస్టోని రిలీజ్ చే'సింది కాంగ్రెస్ పార్టీ. భార్తీ విధాన్(Bharti Vidhan)పేరుతో విడుదల చేసిన యూత్ మేనిఫెస్టోలో నిరుద్యోగం సహా యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అత్యంత వెనుకబడిన కమ్యూనిటీ యువత తమ వ్యాపారం ప్రారంభించడానికి 1 శాతం వడ్డీకి రుణం ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. పరోక్షంగా తానే కాంగ్రెస్ తరపున యూపీ సీఎం అభ్యర్థి అని ప్రియాంక చెప్పకనే చెప్పారు.

ఇంకా చదవండి ...
Congress Youth Manifesto : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Assembly Election) విజయం కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ(Congress) యువత,మహిళలనుపైనే ఎన్నువ ఆశలు పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రత్యేకంగా యూత్ మేనిఫెస్టో రూపొందించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి యూత్ మ్యానిఫెస్టో(Youth Manifesto)ని రిలీజ్ చేశారు. భార్తీ విధాన్(Bharti Vidhan)పేరుతో విడుదల చేసిన  మేనిఫెస్టోలో నిరుద్యోగం సహా యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని  కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యూపీలోని మహిళలకు 40 శాతం టిక్కెట్లను రిజర్వ్ చేస్తానని ప్రకటించింది.

యూత్ మ్యానిఫెస్టోలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1.5 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సెకండరీ, ఉన్నత విద్య, పోలీసు తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇ్చచింది. సంస్కృత ఉపాధ్యాయులు, ఉర్దూ టీచర్లు, అంగన్‌వాడీలు, ఆశా తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, అన్ని పరీక్షా ఫారమ్‌ల ఫీజులు మినహాయించబడతాయని మరియు వారికి బస్సు, రైలు ప్రయాణం ఉచితం చేస్తామని హామీ ఇచ్చింది.

పరీక్ష క్యాలెండర్‌ను విడుదల చేస్తామని.. అందులో రిక్రూట్‌మెంట్ ప్రకటన.. పరీక్ష, నియామక తేదీలను నమోదు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. రిజర్వేషన్ సంబంధిత స్కామ్‌ను నిరోధించేందుకు ప్రతి రిక్రూట్‌మెంట్‌కు సామాజిక న్యాయ పర్యవేక్షకులు ఉంటారని. యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్త అవకాశాలు కల్పిస్తామన్నారు. మల్లాలు, నిషాదుల కోసం ప్రపంచ స్థాయి సంస్థను ఏర్పాటు చేసి అందులో వారికి శిక్షణ ఇస్తారు. అత్యంత వెనుకబడిన కమ్యూనిటీ యువత తమ వ్యాపారం ప్రారంభించడానికి 1 శాతం వడ్డీకి రుణం ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డ్రగ్స్ ఉచ్చు నుంచి యువత బయటపడటం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది యువతకు కౌన్సెలింగ్ ఇస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. స్టార్ట‌ప్‌ల ప్రారంభానికి ప్ర‌త్యేక నిధి ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

ALSO READ Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం మారిన బీజేపీ నినాదం.. మోదీ ఔర్ యోగి అంటూ.

యత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలు యూపీ వ్యాప్తంగా యువతతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. యువత ఇచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగానే కాంగ్రెస్ యువత మేనిఫెస్టో రూపొందించినట్టు చెప్పారు. తాము విద్వేషాన్ని వ్యాప్తి చేయడం లేదని, ప్రజలను ఏకం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ ద్వేషాన్ని వ్యాపింపజేయదని, యువత బలంతో కొత్త యూపీని సృష్టించాలనుకుంటోందని రాహుల్‌ తెలిపారు.

యువత మేనిఫెస్టో వెనుక ఉన్న ఆలోచన..ఉత్త మాటలు చెప్పడం కాదని , ఉత్తరప్రదేశ్ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం అని రాహుల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని యువతకు కొత్త దార్శనికత అవసరమని, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రానికి ఆ విజన్ ఇవ్వగలదని ఆయన అన్నారు. యూపీలో 16 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్ గాంధీ చెప్పారు. . రాష్ట్రంలో ప్రతి గంటకు 880 మంది యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని, 16 లక్షల మంది యువత ఉపాధి కోల్పోయారని ఆయన చెప్పారు. కొత్త యూపీని సృష్టించాలనుకుంటున్నామని, యువతే తమ బలం అన్నారు.

యూపీ యువత తరఫున నిలబడాలని కాంగ్రెస్ నిర్ణయించిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయపార్టీలు 25 - 30లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతారే తప్ప వాటిని ఎలా సృష్టిస్తారన్న విషయాన్ని వివరించవని ఆమె మండిపడ్డారు. యూత్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిందని అన్నారు. పరీక్షల సమయంలో యువత ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపడంపైనా దృష్టి సారించిమని చెప్పారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు... ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుండి మీకు వేరొకరి ముఖం కనిపిస్తుందా? మీరు నా ముఖాన్నే ప్రతిచోటా చూడవచ్చు అని ప్రియాంక గాంధీ సమాధానమిచ్చారు. పరోక్షంగా తానే కాంగ్రెస్ తరపున యూపీ సీఎం అభ్యర్థి అని ప్రియాంక చెప్పకనే చెప్పారు
Published by:Venkaiah Naidu
First published:

Tags: Congress, Uttar Pradesh Assembly Elections

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు