రాజగోపాల్ మాటలతో ఆ విషయం క్లియర్.. : కాంగ్రెస్‌పై తలసాని

ప్రజాస్వామ్యమేదో గాంధీ భవన్‌లో పుట్టినట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే ముందు గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్దిని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్దిని పరిశీలించాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: June 17, 2019, 3:49 PM IST
రాజగోపాల్ మాటలతో ఆ విషయం క్లియర్.. : కాంగ్రెస్‌పై తలసాని
తలసాని శ్రీనివాస్ యాదవ్
news18-telugu
Updated: June 17, 2019, 3:49 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఓ ఇంజనీర్‌లా కష్టపడి పూర్తి చేశాడని అన్నారు. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద గందరగోళం నెలకొందని.. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అన్నారు. ఆయన మాటలను బట్టి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉందన్న విషయం స్పష్టమవుతోందన్నారు.

తెలంగాణకు 24గం. కరెంట్ ఇస్తే టీఆర్ఎస్‌లో చేరుతానని జానారెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని తలసాని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో 24గం. విద్యుత్ అందిస్తున్నామని.. జానారెడ్డి మా పార్టీలో చేరకుండానే ఓడిపోయాడని అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే కాళేశ్వరం ఓపెనింగ్‌కు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.ఒకవేళ ప్రతిపక్షాలు తమ మైండ్ సెట్ మార్చుకుంటే వారిని కూడా ఆహ్వానిస్తామని తెలిపారు.

ఇక కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ సచివాలయాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలను కూడా తలసాని తిప్పికొట్టారు. అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి కావొద్దని ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యమేదో గాంధీ భవన్‌లో పుట్టినట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే ముందు గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్దిని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్దిని పరిశీలించాలని సూచించారు.First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...