Home /News /politics /

CONGRESS JDS COALITION GOVERNMENT IN TROUBLE BJP EXPECTING SOMETHING DIFFERENT FROM KARNATAKA

కష్టాల్లో కర్ణాటక కాంగ్రెస్- జేడీఎస్ సర్కార్... బీజేపీ ప్లాన్ ఇదే ?

యడ్యూరప్ప, అమిత్ షా

యడ్యూరప్ప, అమిత్ షా

కర్ణాటకలో రాజకీయ పరిణామాలను బట్టి కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కష్టాల్లో కూరుకుపోతోందనే విషయం అర్థమవుతోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి బీజేపీ ఏం ఆశిస్తోందన్న అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

    రెండు రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో జరుగుతున్న క్యాంప్ రాజకీయాలను బట్టి చూస్తే... ఏదో జరుగుతోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఆలోచన ఏంటనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు కుమారస్వామి ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీ చేసే చివరి ప్రయత్నిం ఇదేననే టాక్ వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ- బీఎస్పీ కూటమి కట్టిన తరువాత బీజేపీ వ్యూహంలో వచ్చిన మార్పు కూడా కర్ణాటకలో తాజా పరిణామాలకు కారణమై ఉండొచ్చనే వాదనలు మొదలయ్యాయి.

    కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 15 మంది కాంగ్రెస్, ఒక జేడీఎస్ ఎమ్మెల్యేను వారి తమ వైపు లాక్కోవడం బీజేపీకి అసాధ్యమే. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించడమే బీజేపీ లక్ష్యం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే నాటికి కొందరు ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించి గవర్నర్ ద్వారా బీజేపీ ఈ పని చేయొంచవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేయడమే ఈ సారి బీజేపీ లక్ష్యం కాకపోవచ్చని తెలుస్తోంది. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వాన్ని అధికారానికి దూరంగా ఉంచడమే బీజేపీ టార్గెట్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

    సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా ఎస్పీ-బీఎస్పీ కూటమి వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఇలాగే జరుగుతుందనే సంకేతాలను బీజేపీ ఇవ్వనుందని సమాచారం. దీనికి తోడు ఎన్నికలకు ఆర్థిక వనరులను సమకూర్చుకునే క్రమంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టినట్టు అవుతుందన్నది బీజేపీ భావన కావొచ్చు. తమ పార్టీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 99 మందిని ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లోని ఓ రిసార్ట్‌లో బీజేపీ ఉంచింది. కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలను ఆకర్షించే అవకాశం ఉందని భావించే బీజేపీ ఇలా చేసింది. అయితే కుమారస్వామి ప్రభుత్వం నుంచి తమవారిని కాపాడేందుకు రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఉంచామని కర్ణాటక బీజేపీ ముఖ్యనేత యడ్యూరప్ప అన్నారు.

    అయితే బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఆపరేషన్ లోటస్ 3.0గా సీఎం కుమారస్వామి అభివర్ణించారు. సంక్రాంతి రోజున తన తండ్రి అయిన దేవేగౌడ నివాసంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన ఉల్లాసంగా పాల్గొన్నారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల గురించి జేడీఎస్ చీఫ్ దేవేగౌడ స్పందించారు. వారు ఇలా చేయడం మొదటిసారి కాదని వ్యాఖ్యానించారు. వారిని ప్రయత్నించుకోనివ్వడని అన్నారు. యడ్యూరప్పకు అధికారం కోసం ప్రయయత్నిస్తున్నారన్న దేవేగౌడ... ఈ సారి కూడా ఆయన విఫలమవుతారని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను లోబరుచుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నిస్తోందన్న బీజేపీ వాదనలను జోక్‌గా అభివర్ణించిన దేవేగౌడ... బీజేపీనే అలాంటి ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. వాళ్లు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపిస్తున్నారని చెప్పిన దేవేగౌడ... ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు లేదని అన్నారు.


    మరోవైపు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం పరిస్ధితి భిన్నంగా ఉంది. నలుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో లేకుండా పోవడంతో కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. సోమవారం ఉదయమే బెంగళూరుకు చేరుకున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కె.సి. వేణుగోపాల్... పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి కాంగ్రెస్ వ్యూహంపై చర్చించారు.

    అయితే జేడీఎస్ మాత్రం కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం తమ కంటే ఎక్కువగా కాంగ్రెస్‌కు అవసరమని భావిస్తోంది. బీజేపీ ఆకర్షించే ఎమ్మెల్యేల జాబితాలో ఒకే ఒక్క జేడీఎస్ ఎమ్మెల్యే ఉండటం, మిగతా వారంతా కాంగ్రెస్ వారే కావడం కూడా ఇందుకు మరో కారణం.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Congress, Deve gowda, Jds, Karnataka, Kumaraswamy, Yeddyurappa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు