టీడీపీ ఎంపీ మాటలకు సోనియా గాంధీ ఫిదా..

‘జస్టిస్ ఫర్ దిశ’పై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘటనపై మాట్లాడారు.

news18-telugu
Updated: December 2, 2019, 6:15 PM IST
టీడీపీ ఎంపీ మాటలకు సోనియా గాంధీ ఫిదా..
రామ్మోహన్ నాయుడు, సోనియాగాంధీ
  • Share this:
పార్లమెంటులో ఈ రోజు అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. ఎంతోమంది ఉపన్యాసాలను విని, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఓ ఎంపీ ఉపన్యాసానికి ఫిదా అయ్యారు. అదీ.. వేరే పార్టీకి చెందిన ఎంపీ కావడం విశేషం. ‘జస్టిస్ ఫర్ దిశ’పై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘటనపై మాట్లాడారు. మృతురాలు తన చెల్లెలితో మాట్లాడిన ‘భయం వేస్తుంది’ అన్న మాటను నొక్కి చెప్పారు. హిందీలో అనర్గళంగా మాట్లాడిన ఎంపీ.. ఈ ఒక్క మాటను మాత్రం తెలుగులో అన్నారు. దేశంలోని అమ్మాయిలందరూ భయం వేస్తోందని అంటున్నారని, ప్రతి ఒక్క యువతి భయంతో వణికిపోతోందని చెప్పారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన విధానానికి మెచ్చిన సోనియా గాంధీ చప్పట్లతో ప్రశంసించారు.

స్వతహాగానే ఉపన్యాసం ఇవ్వడంలో ఆరితేరిన ఈ యంగ్ ఎంపీ.. గతంలోనూ పార్లమెంట్‌లో తన స్వరానికి జేజేలు కొట్టించుకున్నారు. తెలుగులోనే కాదు.. హిందీలో, ఇంగ్లిష్‌లో సూపర్‌గా మాట్లాడగల ఈయన ఎన్నికలకు ముందు.. టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా హిందీలో మాట్లాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>