‘పార్టీ మారబోమని అఫిడవిట్’... టి కాంగ్రెస్ కొత్త ప్రయోగం

ఎన్నికల్లో గెలిచిన పార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం వినూత్నమైన ప్రయోగానికి తెలంగాణ కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుందని సమాచారం.

news18-telugu
Updated: April 17, 2019, 7:29 PM IST
‘పార్టీ మారబోమని అఫిడవిట్’... టి కాంగ్రెస్ కొత్త ప్రయోగం
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 17, 2019, 7:29 PM IST
ఎన్నికల్లో నాయకులను గెలిపించుకోవడం కంటే... గెలిచిన వాళ్లు పార్టీ ఫిరాయించకుండా ఉండేలా చూసుకోవడమే ఇప్పుడు పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. ఒక పార్టీ తరపున గెలిచిన నేతలు మరో పార్టీలోకి వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దీంతో గెలిచిన వాళ్లు పార్టీ మారకుండా ఉండేలా చూసుకోవడం రాజకీయ పార్టీలకు కష్టసాధ్యంగా మారింది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఇది తలకు మించిన భారంగా తయారైంది. తెలంగాణలో కొంతకాలంగా విపక్షాలకు చెందిన సభ్యులు ఎన్నికల్లో గెలిచిన తరువాత అధికార పార్టీలోకి వెళ్లడం కామనైపోయింది. వీరు పార్టీ మారకుండా అడ్డుకోవడంలో ఆయా పార్టీలు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు.

దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు... గెలిచిన వారు పార్టీ మారకుండా ఉండేలా ఏం చేయాలనే దానిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. టీ పీసీసీ చీఫ్ కుంతియా, టి కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా హాజరైన ఈ సమావేశంలో నేతలు పార్టీ మారకుండా ఉండేలా చేయడానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేసే వారి నుంచి గెలిచిన తరువాత పార్టీ మారబోమని అఫిడవిట్ తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై నేతలు చర్చించారు.

ఈ అంశంపై నేతల్లో సానుకూలత వ్యక్తంకాగా... చట్టబద్ధంగా ఇది సాధ్యమవుతుందా లేదా అనే అంశంపై పరిశీలించాల్సి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే ప్రయోగాత్మకంగా అయినా ఇలాంటి వాటిని అమలు చేయాలని కొందరు కోరినట్టు సమాచారం. గెలిచిన అభ్యర్థులు పార్టీ మారకుండా అడ్డుకోగలిగితే... ఎన్నికల తరువాత జరగబోయే జడ్పీ చైర్‌పర్సన్ సీట్లను దక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి గెలిచిన అభ్యర్థులు పార్టీ మారకుండా ఉండేలా కాంగ్రెస్ తీసుకోవాలనుకుంటున్న సరికొత్త చర్యలు ఆచరణలో సాధ్యమేనా లేదా అన్నది చూడాలి.First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...