కాంగ్రెస్ గెలవకపోతే పరిస్థితి ఏమిటి... తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్ ?

ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడిన పక్షంలో మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొకతప్పదనే భయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోందని ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 22, 2019, 3:36 PM IST
కాంగ్రెస్ గెలవకపోతే పరిస్థితి ఏమిటి... తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్ ?
టీ కాంగ్రెస్ నేతలు (File)
  • Share this:
కేంద్రంలో మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేదే గెలుపు అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని తేల్చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజంకావని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన స్థాయిలో బీజేపీకి అనుకూల ఫలితాలు ఉండబోవని భావిస్తోంది. కేంద్రంలో అవకాశం దొరికితే కచ్చితంగా మోదీ మళ్లీ ప్రధాని కాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఫలితాలు రావడానికి ముందుగానే విపక్షాలకు చెందిన నేతలతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు... ఫలితాలు తరువాత ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టెన్షన్ ఎలా ఉన్నా... జాతీయస్థాయిలో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఎలా అనే ఆందోళన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా రాష్ట్రంలో బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీ... కేంద్రంలో తమ పార్టీ అధికారంలో వస్తే రాష్ట్రంలో మళ్లీ బలపడొచ్చని ఆశాభావంతో ఉంది. కాంగ్రెస్ మద్దతుతో కూడిన ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేయొచ్చని టి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడిన పక్షంలో మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొకతప్పదనే భయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోందని ప్రచారం జరుగుతోంది.

కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి రానిపక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొదట తగిలే ఎదురుదెబ్బ ఆ పార్టీ సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం కావడమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ నాయకత్వం తమ పార్టీలో చేర్పించుకుని సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే ఈలోగా ఎన్నికలు రావడం... కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని ఊహాగానాలు రావడంతో... ఈ విషయంలో టీఆర్ఎస్ కొంత వెనక్కి తగ్గినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్రంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగా ఎన్డీయే సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తే... తెలంగాణలోని టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం దాదాపుగా ఖాయమని కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది. మొత్తానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా అధికారంలోకి రానిపక్షంలో... తెలంగాణలో ఆ పార్టీకి కష్టాలు తప్పేలా లేవని వార్తలు జోరందుకున్నాయి.
First published: May 22, 2019, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading