దేశంలో కాంగ్రెస్ హవా... టీఆర్ఎస్ సంగతి హైకమాండ్ చూసుకుంటుందన్న అజారుద్దీన్

ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ తాను చేసిన అభివృద్ధి కంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ విమర్శించారు.

news18-telugu
Updated: May 13, 2019, 3:51 PM IST
దేశంలో కాంగ్రెస్ హవా... టీఆర్ఎస్ సంగతి హైకమాండ్ చూసుకుంటుందన్న అజారుద్దీన్
అజారుద్దీన్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: May 13, 2019, 3:51 PM IST
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ తాను చేసిన అభివృద్ధి కంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారని ఆయన విమర్శించారు. ఉద్యోగాల కల్పనపై తాను గతంలో ఇచ్చిన హామీల గురించి మోదీ ఎక్కడా ప్రస్తావించడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమవుతుందనే అంశంపై కూడా అజారుద్దీన్ స్పందించారు. ఒకవేళ యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు.

హైదరాబాద్‌లోని అంబర్ పేట్ మజీద్ స్థలం వివాదంపై స్పందించిన అజారుద్దీన్... మజీద్‌ను జీహెచ్ఎంసీ అక్రమంగా కూల్చేసిందని ఆరోపించారు. పురాతన మజీద్‌కి కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దీనికి కారణమైన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అజారుద్దీన్ డిమాండ్ చేశారు. మజీద్ కూల్చివేతకు సంబంధించి నష్టపరిహారం చెల్లించామంటున్న అధికారుల వాదనను అజారుద్దీన్ తప్పుబట్టారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న మజీద్‌కి సంబంధించి నష్టపరిహారాన్ని ఇతరులకు ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు.


First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...