రేవంత్ రెడ్డికి బిగ్ షాక్... టీపీసీసీ చీఫ్ పదవి లేనట్టేనా ?

టీపీసీసీ చీఫ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డికి ఈ పదవి దక్కడం కష్టమే అనే టాక్ కూడా వినిపిస్తోంది. కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డి భూ కబ్జాతో పాటు పలు వివాదాల్లో ఇరుక్కోవడం కూడా ఆయనకు మైనస్‌గా మారిందనే ప్రచారం మొదలైంది.

news18-telugu
Updated: March 12, 2020, 3:02 PM IST
రేవంత్ రెడ్డికి బిగ్ షాక్... టీపీసీసీ చీఫ్ పదవి లేనట్టేనా ?
రేవంత్ రెడ్డి (File)
  • Share this:
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. దీంతో టీ పీసీసీ కొత్త చీఫ్ ఎవరనే దానిపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. స్వయంగా సోనియాగాంధీ కోమటిరెడ్డిని తన నివాసానికి పిలుపించుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇతర రాజకీయ అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.

కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన త్వరలోనే వెలువడుతుందన్న కథనాల నేపథ్యంలో సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త పీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ సారథ్యపగ్గాలను తనకు అప్పగించాలని గతంలో పలుసార్లు ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్... టీపీసీసీ చీఫ్ పదవి లేనట్టేనా ? | Congress high command to give shock to revanth reddy by denying tpcc presient post ak
కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి


సోనియగాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కావడంతో... టీ పీసీసీ చీఫ్ పదవి దాదాపుగా ఆయనకే ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డికి ఈ పదవి దక్కడం కష్టమే అనే టాక్ కూడా వినిపిస్తోంది. కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డి భూ కబ్జాతో పాటు పలు వివాదాల్లో ఇరుక్కోవడం కూడా ఆయనకు మైనస్‌గా మారిందనే ప్రచారం మొదలైంది.

దీనికి తోడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున కాకుండా తన సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారని... ఈ కారణంగానే టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి తరువాత స్థానంలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైపు ఆ పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపే అకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: March 12, 2020, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading