కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న వరుస ఓటముల కారణంగా తన టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసైడయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఇక తాను ఈ పదవిలో కొనసాగలేనని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయననే టీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినట్టు తెలుస్తోంది.
నిజానికి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని భావించారు. అయితే కొద్ది నెలలకే సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో... అప్పటివరకు పదవిలో కొనసాగాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనను కోరినట్టు సమాచారం. ఆ ఎన్నికలు పూర్తయిన తరువాత హుజూర్ నగర్ ఉప ఎన్నిక వరకు టీ పీసీసీ చీఫ్‌గా కొనసాగాలని ఉత్తమ్ భావించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు వరకు ఉత్తమ్‌నే టీ పీసీసీ చీఫ్‌గా కొనసాగాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరినట్టు వార్తలు వస్తుండటంతో... ఈ ఏడాది చివరివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి లేనట్టే అనే టాక్ వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Sonia Gandhi, Telangana, Tpcc, Uttam Kumar Reddy