తెలంగాణలో బీజేపీ బాటలోనే కాంగ్రెస్.. రేవంత్ రెడ్డికి నిరాశే ?

టీపీసీసీ చీఫ్ పదవి రేసులో చాలామంది నేతల పేర్లు వినిపిస్తున్నా... ప్రధాన పోటీ మాత్రం ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యే ఉందని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 19, 2020, 6:18 PM IST
తెలంగాణలో బీజేపీ బాటలోనే కాంగ్రెస్.. రేవంత్ రెడ్డికి నిరాశే ?
తెలంగాణ కాంగ్రెస్
  • Share this:
కరోనా ప్రభావం మెల్లిమెల్లిగా తగ్గడంతో మళ్లీ ఇతర అంశాలపై దృష్టి పెట్టారు నేతలు. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు మళ్లీ టీపీసీసీ చీఫ్ పదవిపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అనేక మంది నేతలు టీ పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతుంటే... మరికొందరు మాత్రం తమకు ఆ పదవిపై ఆసక్తి లేదని బాహాటంగానే ప్రకటించారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకమైన పదవిని దక్కించుకునేందుకు నేతలంతా ఎవరికివారే సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవి రేసులో చాలామంది నేతల పేర్లు వినిపిస్తున్నా... ప్రధాన పోటీ మాత్రం ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యే ఉందని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.

Revanth reddy, komatireddy venkat reddy, Telangana, congress, tpcc, Sonia Gandhi, Rahul Gandhi, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ, కాంగ్రెస్, టీపీసీసీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి


ఒకవేళ కరోనా సంక్షోభం తలెత్తకపోయి ఉంటే... ఇప్పటికే తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక పూర్తయ్యేదనే వాదన కూడా ఉంది. అయితే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం కూడా కాంగ్రెస్‌లోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కలిసొచ్చే విధంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. బీజేపీలోకి ఇటీవల అనేక మంది నేతలు చేరారు. అయితే మాత్రం ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న ఎంపీ బండి సంజయ్‌ చేతికి రాష్ట్ర సారథ్య బాధ్యతలను అప్పగించింది.

డీకే అరుణ, జితేందర్ రెడ్డి సహా అనేకమంది నేతలు టీ బీజేపీ చీఫ్ పదవి కోసం ప్రయత్నించినా... బీజేపీ అధినాయకత్వం మాత్రం మొదటి నుంచి పార్టీలో ఉన్న బండి సంజయ్‌కు ఛాన్స్ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయితే రేవంత్ రెడ్డికి బదులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చని పలువురు భావిస్తున్నారు. దీనికి తోడు రేవంత్ రెడ్డికి చంద్రబాబుతో ఉన్న పాత పరిచయాలు, కేసులు వంటి అంశాలు ఆయనకు మైనస్‌గా మారొచ్చనే ప్రచారం కూడా కాంగ్రెస్‌లో సాగుతోంది. మొత్తానికి తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి కంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందున్నట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: May 19, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading