రేవంత్ రెడ్డికి కీలక పదవి ఖాయమైందా..?

ఉన్నట్టుండి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి అంశాన్ని ఎందుకు ప్రస్తావించారనే అంశంపై కూడా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: June 2, 2020, 4:01 PM IST
రేవంత్ రెడ్డికి కీలక పదవి ఖాయమైందా..?
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డికి త్వరలోనే కీలక పదవి దక్కనుందా ? రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉందా ? చాలాకాలంగా టీపీసీసీ పదవి అంశాన్ని పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వం... త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణలో టీపీసీసీ పదవిని కొత్త వారికి ఇచ్చే విషయంలో మరింత ఆలస్యం చేయొద్దనే భావనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఇందుకు సంబంధించి ఢిల్లీలో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ రేసులో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముందున్నారనే ప్రచారం సాగుతోంది.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి రేసులో ఉండటాన్ని కాంగ్రెస్‌లోని పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో, రాజకీయాల్లో తమకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి ఈ పదవి ఇవ్వడం సరికాదనే భావనలో వారంతా ఉన్నట్టు సమాచారం. కొందరు నేతలు ఈ విషయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ అంశంపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను వ్యతిరేకిస్తానని అన్నారు. ఆ తరువాత ఆయనకు ఉత్తమ్ క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఉన్నట్టుండి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి అంశాన్ని ఎందుకు ప్రస్తావించారనే అంశంపై కూడా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఓ ముఖ్యనేత రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పగ్గాలు ఇస్తే బాగుంటుందని హైకమాండ్‌కు చెప్పారని... ఆయన సూచన మేరకు రేవంత్ రెడ్డికి ఈ పదవి కట్టబెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్‌లో తీసుకునే నిర్ణయాలు చివరి నిమిషంలోనూ మారిన సందర్బాలు చాలా ఉన్నాయని... కాబట్టి రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ దక్కుతుందా లేదా అన్నది చెప్పలేమనే వాదన కూడా వినిపిస్తోంది.
First published: June 2, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading