హోమ్ /వార్తలు /రాజకీయం /

Jaggareddy: జగ్గారెడ్డికి మంత్రి పదవి.. కాంగ్రెస్ టార్గెట్ 79 సీట్లు.. ఫిక్స్ చేసిన ఠాగూర్

Jaggareddy: జగ్గారెడ్డికి మంత్రి పదవి.. కాంగ్రెస్ టార్గెట్ 79 సీట్లు.. ఫిక్స్ చేసిన ఠాగూర్

ఉత్తమ్, జగ్గారెడ్డి‌తో మాణికం ఠాగూర్ (ఫైల్ ఫోటో)

ఉత్తమ్, జగ్గారెడ్డి‌తో మాణికం ఠాగూర్ (ఫైల్ ఫోటో)

Telangana Congress: కేసీఆర్ అంటే కమీషన్ల చంద్రశేఖర్ రావు అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ విమర్శించారు. ప్రాజెక్ట్‌ల ద్వారా వేల కోట్లు డబ్బులు దండుకున్నారని ఠాగూర్ ధ్వజమెత్తారు.

  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జగ్గారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, ఏఐసీసీ నేత మాణికం ఠాగూర్ అన్నారు. 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 79 సీట్లు గెలుచుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గంజి మైదానంలో ఒక్కరోజు దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్షలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు ఠాగూర్. 1979లో ఇందిరా గాంధీ సంగారెడ్డిలోని ఇదే ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారని ఠాగూర్ అన్నారు. అందుకే తాము ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

  ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సోనియాగాంధీ ఇచ్చారో ఆ ఆకంక్షలు నెరవేరడం లేదని ఠాగూర్ అన్నారు. కేవలం తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన మాత్రమే నడుస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఒక్కే ఒక్క కుటుంబం ధనవంతమైన కుటుంబం కేసీఆర్ కుటుంబమని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్ ముఖేష్ అంబానీతో పోటీ పడుతున్నారని ఠాగూర్ అన్నారు. అయితే అంబానీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తే.. కేసీఆర్ మాత్రం కమిషన్లు తీసుకుని డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. కేసీఆర్ అంటే కమీషన్ల చంద్రశేఖర్ రావు అని విమర్శించారు. ప్రాజెక్ట్‌ల ద్వారా వేల కోట్లు డబ్బులు దండుకున్నారని ఠాగూర్ ధ్వజమెత్తారు.


  కేసీఆర్ బాత్ రూమ్ ..పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ కంటే ఖరీదైనదని అన్నారు. 2023లో కాంగ్రెస్ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా సంగారెడ్డికి రావడం గౌరవంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాజీ మంత్రి గీతారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా 9 నియోజకవర్గాల ఇంచార్జ్‌లు పాల్గొన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Jaggareddy, Telangana

  ఉత్తమ కథలు