కేసీఆర్‌కు షాక్... యాదాద్రిలో కాంగ్రెస్ హవా

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నా... యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మాత్రం అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

news18-telugu
Updated: January 25, 2020, 11:26 AM IST
కేసీఆర్‌కు షాక్... యాదాద్రిలో కాంగ్రెస్ హవా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నా... యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మాత్రం అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా... అందులో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సభ్యులు 8 స్థానాలు గెలుచుకోగా... టీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత యాదాద్రిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది. అయినా ఇక్కడ కాంగ్రెస్ సభ్యులు మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు