‘కాంగ్రెస్ గో బ్యాక్’.. వైసీపీ ఆందోళనలు... నెల్లూరు జిల్లాలో రచ్చ

రఘువీరారెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంతోపాటు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందన్న నినాదంతో హస్తం నేతలు బస్సుయాత్రను చేపట్టారు.

  • Share this:
    నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్‌ బస్సులకు వైసీపీ నేతలు బ్రేక్ వేశారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసకుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసాయాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు.

    రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందన్న నినాదంతో హస్తం నేతలు బస్సుయాత్రను చేపట్టారు. మార్చి 3 వరకు ఈ యాత్ర సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు బస్సుయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డుకు బస్సుయాత్ర చేరింది. అయితే, అక్కడ కాంగ్రెస్ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
    First published: