యూపీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన నేపథ్యంలోనే ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. అయితే ఆ పార్టీ ప్రకటించిన జాబితాలో సంచలన నిర్ణయమే తీసుకుంది. పార్టీ అభ్యర్థుల గెలుపోటములతో సంబంధం లేకుండా ఓ సాధారణ మహిళను తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అది కూడా బీజేపీకి ఓడించడమే లక్ష్యంగా పావులు కదిపింది. ఈ క్రమంలోనే సరికొత్త రాజకీయాలకు తెర తీశారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే చేతిలో అత్యాచారానికి గురై ఆ తర్వాత ఆ కుంటంబానికి సంబంధించిన వారిపై హత్యా యత్నం చేయడంతో పాటు బాధితురాలిని కూడా చంపేందుకు బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నించిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా పార్టీ పావులు కదిపింది. అత్యాచార బధితురాలి తల్లికి సీటును కేటాయించింది,
ఉన్నావ్ అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ , ఓ మైనర్ బాలికను ఉద్యోగం పేరుతో లోంగ దీసుకుని అత్యాచారం చేయడంతో పాటు , కేసుకు సంబంధించిన సాక్షులను సైతం ప్రమాదానికి గురి చేసి హత్య చేసిన పరిస్థితి నెలకొంది.. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మీడియా అటెన్షన్ మొత్తం బాధితురాలికి వైపుకు మళ్లింది. అయినా కేసు నుండి తప్పించుకునే అనాటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అనేక ప్రయత్నాలు చేశాడు. దీనికి తోడు అధికార బీజేపీ సైతం ఆయనకు అండగా ఉండడంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి.. చివరకు కేసును ప్రత్యేకంగా యూపీలో కాకుండా ఢిల్లీలో విచారణ చేశారు.. విచారణలో భాగంగానే ఢిల్లీలోని తీస్ హజారీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2019 డిసెంబర్ 20న మాజీ ఎమ్మెల్యే కుల్దిప్ సింగ్ కు యావజ్జీవ శిక్ష విధించడంతో పాటు 25లక్షల పరిహరం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Constable remand : మహిళా కానిస్టేబుల్‌తో క్లోజ్.. రెండు సార్లు గర్భం చేసి.. ఆ తర్వాత..!
ఇక ఆ తర్వాత కూడా కొద్ది రోజులకు జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సైతం కుల్దీప్ సింగార్ భార్య సంగీత సెంగార్‌కు ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ నుంచి బీజేపీ టికెట్ కేటాయించింది. దీంతో అక్కడి రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగార్‌కు శిక్ష పడడంతో పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో మరోసారి దుమారం రేగడంతో బీజేపీ వెనక్కి తగ్గి ఆమెను పోటి నుండి తప్పించింది.
CM KCR : రైతులకు శుభవార్త.. వారికి మరో కొత్త పథకం.. కసరత్తు చేయాలని అధికారులకు ఆదేశించిన సీఎం
కాగా తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. అత్యాచార బాధితురాలి తల్లికి ఎన్నికల్లో అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి తల్లి, తన కూతురుకు జరిగిన అన్యాయంపై పోరాటాన్ని కొనసాగించేందుకు ఆమెకు సీటు కేటాయించామని చెప్పారు. తన కూతురిని ఏ అధికారం ద్వారా హింసించారో, ఆమె కుటుంబం ఎలా నాశనం అయిందో.. అదే అధికారాన్ని ఆమె కూడా పొందాలి అనే ఉద్ధేశ్యంతో సీటు కేటాయించినట్లు చెప్పారు ప్రియాంకా గాంధీ.
TS Politics : లాలుకు పట్టిన గతే కేసీఆర్‌కు ..! జైలు అనుభవం కోసమే తేజస్వీయాదవ్ తో భేటి..
మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన 175 మంది జాబితాలో 40 శాతం మేర యువతకు అవకాశాలు కల్పించినట్టు ప్రియాంక గాంధీ చెప్పారు. కాగా వీరిలో మహిళలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు కూడా ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఓ ఆశా కార్యకర్తకు కూడా సీటును కేటాయించినట్టు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assembly Election 2022, Congress, UP Assembly Elections 2022