60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత

అవివాహితుడిగా ఉన్న ముకుల్ వాస్నిక్.. 60 ఏళ్ల వయసులో ఇంటి వారయ్యారు. ఈయన భార్య రవీణా ఖురానా వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉంటూనే పలు వ్యాపారాలు చేస్తున్నారు

news18-telugu
Updated: March 9, 2020, 2:53 PM IST
60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత
ముకుల్ వాస్నిక్, రవీనా ఖురానా
  • Share this:
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. తన చిరాకాల స్నేహితురాలు రవీణా ఖురానాతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రవీణా వయసు కూడా 60 ఏళ్లే. ఢిల్లీలోని ఓ హోటల్‌లో వీరిద్దరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌తో పాటు వీరికి అత్యంత సన్నిహితంగా ఉండే చాలా కొద్ది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవుల్లో ఉన్నారు. కేంద్రమంత్రిగానూ సేవలందించారు. ప్రస్తుతం AICC ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ముకుల్ వాస్నిక్. ఐతే ఈయన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అవివాహితుడిగా ఉన్న ముకుల్ వాస్నిక్.. 60 ఏళ్ల వయసులో ఇంటి వారయ్యారు. ఈయన భార్య రవీణా ఖురానా స్వస్థలం ఢిల్లీ. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉంటూనే పలు వ్యాపారాలు చేస్తున్నారు. ముకుల్, రవీణా పెళ్లి నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

Published by: Shiva Kumar Addula
First published: March 9, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading