74 మందితో కాంగ్రెస్ తొలి జాబితా... 10న విడుదల

74 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 10న విడుదల చేయనుంది. మహాకూటమిలోని ఇతర పార్టీలకు 25 పార్టీలను కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకు 3 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు కుంతియా తెలిపారు.

news18-telugu
Updated: November 8, 2018, 6:41 PM IST
74 మందితో కాంగ్రెస్ తొలి జాబితా... 10న విడుదల
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (File)
news18-telugu
Updated: November 8, 2018, 6:41 PM IST
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అంశం ఓ కొలిక్కి వచ్చింది. సోనియాగాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 74 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. వీరి పేర్లను తొలి జాబితాగా ఈ నెల 10న ప్రకటించనుంది. మహాకూటమిలోని ఇతర పార్టీలకు 25 పార్టీలను కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకు 3 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు కుంతియా తెలిపారు. ఒక స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తం 93 లేదా 94 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. ఇందులో 19 నుంచి 20 సీట్లలో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. 74 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయబోతున్నట్టు కుంతియా ప్రకటించారు. 11, 12 తేదీల్లో మరోసారి సమావేశమైన మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అభ్యర్థులను ప్రకటించడంతో పాటు రెబల్స్‌ను బుజ్జగించే అంశంపై ఈ సారి కాస్త ఎక్కువగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ... అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.


First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...