టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనంపై హైకోర్టుకు కాంగ్రెస్‌...

Telangana CLP : విలీనంపై స్పీకర్‌ నిర్ణయాన్ని కొట్టివేయాలని కాంగ్రెస్ నేతలు కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 10, 2019, 2:14 PM IST
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనంపై హైకోర్టుకు కాంగ్రెస్‌...
భట్టి విక్రమార్క (File)
  • Share this:
TRS శాసన సభా పక్షంలో CLP విలీనాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి జారీచేసిన సీఎల్పీ విలీనం ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. ఐతే ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను... టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్‌ మొన్ననే నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందనీ... కాంగ్రెస్‌ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎల్పీ తీర్మానం లేకుండానే... 12 మంది ఎమ్మెల్యేలు విలీనాన్ని కోరడం... స్పీకర్‌ దాన్ని యథాతథంగా ఆమోదించడం చట్టబద్ధంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ నిర్ణయాన్ని కొట్టివేయాలని వారు కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై మంగళవారం విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.

టీఆర్ఎస్ నేతలు మాత్రం స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇందులో రాజ్యాంగ విరుద్ధంగా ఏమీ జరగలేదనీ, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇలాంటి ఫిరాయింపులు, విలీనాలను ప్రోత్సహించినప్పుడు ఈ నియమాలూ, నిబంధనలూ గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: June 10, 2019, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading