• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS FILED A PETITION IN COURT TO STOP MUNICIPAL ELECTIONS DUE TO CORONA SPREAD VS

Municipal elections : ఎన్నికల నిలిపివేతకు కోర్టులో కాంగ్రెస్ పిటిషన్ ..న్యాయమూర్తి ఎమన్నారంటే..

Municipal elections : ఎన్నికల నిలిపివేతకు కోర్టులో కాంగ్రెస్  పిటిషన్ ..న్యాయమూర్తి ఎమన్నారంటే..

షబ్బీర్ అలీ (File)

muncipal elections : తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కింది. కరోనా వ్యాప్తి ఉదృతంగా కొనసాగుతున్నందున్న ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.

  • Share this:
    తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కింది. కరోనా వ్యాప్తి ఉదృతంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రజా ప్రయోజనాల దృష్ట్ర్య వాటిని వాయిదా చేయాలని పలు పార్టీలు కోరుతున్న విషయం తెలిసిందే..దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను రద్దు చేయాలని పార్టీ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ ధాఖలు చేశారు. కరోనా నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే రాత్రి కర్ష్పూ విధించిందని పిటిషన్ లోపేర్కోన్నారు. ఇలాంటీ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సబబు కాదంటూ ఆయన పిటిషన్ లో పేర్కోన్నారు. అయితే కోర్టు చీఫ్ జస్టీస్ హెమా మాత్రం పిటిషన్ విచారించేందుకు నిరాకరించింది. లంచ్ మోషన్ పిటిషన్ విచారించేందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టుకు రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసేందుకు షబ్బిర్ ఆలీ సిద్దం అవుతున్నట్టు సమాచారం.

    మరోవైపు బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికలను ఆపాలంటూ ఆపార్టీ నేత లక్ష్మణ్ సైతం గవర్నర్ తమిళి సైకి లేఖ రాశారు. ముఖ్యమంత్రికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ద ప్రజల ఆరోగ్యం మీద లేదని ఆయన లేఖలో పేర్కోన్నారు. కరోనా నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ఆయన గరవ్నర్‌ను కోరారు.
    Published by:yveerash yveerash
    First published: