Home /News /politics /

CONGRESS CRISIS JYOTIRADITYA SCINDIA TO ABHIJIT MUKHERJEE CONGRESS LEADERS WHO LEFT TO JOIN BJP TMC PARTY SK GH

Congress: కష్టాల్లో కాంగ్రెస్.. 7 ఏళ్లలో 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామా.. లిస్ట్‌లో ప్రముఖులు వీరే

కాంగ్రెస్ పార్టీ జెండా

కాంగ్రెస్ పార్టీ జెండా

Congress Crisis: దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత విభేదాలు, నేతల కుమ్ములాటలతో పార్టీ పట్టు కోల్పోతుంది.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత విభేదాలు, నేతల కుమ్ములాటలతో పార్టీ పట్టు కోల్పోతుంది. ఈ క్రమంలో పార్టీలో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భావించిన ఎందరో నేతలు ఇతర పార్టీలకు వరుస కడుతున్నారు. గత ఏడేళ్లలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన 177 మంది నేతలు (ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి) పార్టీని వీడారంటే.. కాంగ్రెస్ పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా విచ్ఛిన్నమవుతున్న పార్టీలో తాజాగా చేరారు యువ నాయకులు కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని. అయితే ఇలాంటి వారి వల్ల పార్టీకి ఎంత లాభం ఉంటుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన అగ్రనేతలు ఎవరు, ప్రస్తుతం వారికి ఇతర పార్టీల్లో ఎలాంటి ప్రాధాన్యం ఉంది? వంటి విషయాలు తెలుసుకుందాం.

అధికారమే అన్నిరాజకీయ పార్టీలకు పరమావధి. భారత్‌లో ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు సర్వసాధారణంగా మారాయి. నాయకత్వం, అధికారం, డబ్బు.. వంటి ఆశలతో కొందరు పార్టీమారుతుంటారు. అయితే అధికారానికి దూరంగా ఉన్న పార్టీలో కొత్తగా చేరికలు మాత్రం అరుదనే చెప్పుకోవాలి. ఇటీవల కాంగ్రెస్‌లో అలాంటిదే జరిగింది. యూత్‌ లీడర్లుగా దేశం దృష్టిని ఆకర్షించిన కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని ఈ మంగళవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే బుధవారం నాటికి కాంగ్రెస్‌లో అసంతృప్తి వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ సీనియర్లు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ వంటివారు పార్టీ ప్రక్షాళన గురించి బహిరంగంగా మాట్లాడి అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టారు. పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్‌ను విడిచి వెళ్లిన నాయకుల గురించి కపిల్ సిబల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. అదేరోజు సాయంత్రానికి.. కోపంతో ఉన్న అమరీందర్ సింగ్, హోం మంత్రి అమిత్ షాను కలవడానికి ఢిల్లీ చేరుకున్నారు. అమరీందర్ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Teenmar mallanna in BJP : బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. విడుదల చేయించాలని అమిత్ షాకు లేఖ

* 2014 నుంచి పరాభవం
2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. 2014లో దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. అప్పటి నుంచి దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గత ఏడు సంవత్సరాల్లో చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు పార్టీని వీడారు. ఇదే సమయంలో కొందరు నాయకులు పార్టీకి వచ్చారు. ఇటీవలి ADR సర్వే ప్రకారం.. 2014 నుంచి 2021 వరకు మొత్తం 222 మంది అభ్యర్థులు కాంగ్రెస్‌ని వీడి ఇతర పార్టీల్లో చేరారు. 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ని వీడారు. ఇదే సమయంలో వివిధ పార్టీల నుంచి 115 మంది అభ్యర్థులు, 61 మంది ఎంపీలు-ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.

అమిత్ షా చేసిన సాయాన్ని మరిచిపోలేను.. ఆ విషయాలను గుర్తుచేసుకున్న దిగ్విజయ్ సింగ్

గత కొన్ని నెలలుగా ప్రతి నెలా ఎవరో ఒకరు కాంగ్రెస్ ప్రముఖులు పార్టీని వీడుతున్నారు. ఈ జూన్‌లో రాహుల్ గాంధీ సన్నిహితుడు జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. జులైలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్‌ని వీడి TMC లో చేరారు. ఆగస్టులో మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సుస్మితా దేబ్ కూడా TMC లో చేరారు. సెప్టెంబర్ నెలాఖరుకు ముందు అమరీందర్ సింగ్ సైతం పార్టీ తీరును తప్పుబడుతూ నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో గత ఏడేళ్లలో కాంగ్రెస్‌ని వీడిన అగ్రనాయకులు ఎవరు? పార్టీని వీడటానికి ముందు కాంగ్రెస్‌లో వారి స్థానం ఏంటి? పార్టీని వీడిన తర్వాత వీరు ఏ స్థాయిలో ఉన్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం.

1. సుస్మితా దేబ్
ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సుస్మితా దేబ్.. పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. గతంలో అస్సాంలోని సిల్చార్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆమె తండ్రి సంతోశ్ మోహన్ దేబ్‌ సైతం అస్సాం కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. తరువాత అస్సాం, త్రిపురలో పార్టీ భాద్యతలను టీఎంపీ ఆమెకు కట్టబెట్టింది. తాజాగా టీఎంసీ ఆమెను రాజ్యసభకు పంపింది. సుస్మిత ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2. అభిజిత్‌ ముఖర్జీ
దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ కాంగ్రెస్ నేత, దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన అభిజిత్, తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీతో సహా రాజకీయ పదవుల్లో తనకు అగ్రనాయకత్వం ప్రధాన్యం ఇవ్వట్లేదని, ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదనే అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని జంగీపూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2012, 2014లలో ఎంపీగా గెలుపొందిన అభిజిత్.. 2019లో తృణమూల్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

YS Sharmila: నాంపల్లి కోర్టు.. ఆ కేసులో వైఎస్ షర్మిల, విజయమ్మకు ఊరట..

3. జితిన్ ప్రసాద
ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ వర్గానికి చెందిన కీలక కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీ సన్నిహితుడు జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. జితిన్ కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్‌తోనే ఉంటోంది. యూపీ కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న జితేంద్ర ప్రసాద కుమారుడే జితిన్. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. పార్టీ మారిన తరువాత యూపీ మంత్రివర్గంలోకి జితిన్‌ను తీసుకున్నారు.

4. జ్యోతీరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన యువనేతగా గుర్తింపు దక్కించుకున్న జ్యోతీరాధిత్య సింధియా సీఎం కుర్చీని ఆశించారు. అయితే సీనియర్ అశోక్ గెహ్లోత్‌ను అదిష్టానం సీఎంగా ఎంపికచేసింది. దీంతో ఆయన వర్గం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ప్రభుత్వాన్ని కూల్చారు. తరువాత సింధియాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న బీజేపీ, ఆయనకు పౌర విమానయాన శాఖను అప్పగించింది.

పవన్ కళ్యాణ్‌కు చెక్.. వైసీపీ సరికొత్త ప్లాన్.. అసలు కారణం ఇదేనా..

5. ప్రియాంక చతుర్వేది
మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి శివసేనలో చేరారు. తనపట్ల అమర్యాదగా వ్యవహరించిన వారికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆమె వ్యతిరేకించి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

6. నారాయణ్ రాణే
మహారాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్ నేత నారాయణ్ రాణే 2017లో పార్టీని వీడారు. తరువాత శివసేనలో చేరగా, అక్కడి నుంచి బీజేపీలో చేరారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.

7. హిమంత బిశ్వ శర్మ
అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న హిమంత 2015లో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన తరువాత, అస్సాం ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

Tamilnadau : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !

8. విజయ్ బహుగుణ, రీటా బహుగుణ
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ పీసీసీలో కీలకంగా వ్యవహరించిన వీరిద్దరూ 2016లో పార్టీని వీడారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

9. రాధాకృష్ణ పాటిల్
మహారాష్ట్రకు చెందిన రాధాకృష్ణ పాటిల్ 2019లో పార్టీని వీడారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.

10. ఎస్‌ ఎం కృష్ణ
కేంద్ర మంత్రిగా పనిచేసిన కర్ణాటక నేత, 2017లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభ కోల్పోతోందనే ఉద్దేశంతో ఆయన పార్టీని వీడారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Aicc, Congress, Politics, Rahul Gandhi

తదుపరి వార్తలు