టీఆర్ఎస్‌లో తెలంగాణ కాంగ్రెస్ విలీనం కానుందా? కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారిలో పదిమంది ఇప్పటికే గులాబీ గూటికి చేరిపోయారు. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

news18-telugu
Updated: April 21, 2019, 5:26 PM IST
టీఆర్ఎస్‌లో తెలంగాణ కాంగ్రెస్ విలీనం కానుందా? కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ ఫిరాయింపులు ఆగడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి రోజురోజుకు వలసలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు... టీడీపీకి చెందిన పలువురు నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు కమలం గూటికి చేరారు. ఇప్పుడు మిగిలున్న కొంతమంది నేతల్ని కూడా తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు అధికార పక్షం రెడీగా ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ సీఎల్పీ విలీనానికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

దీంతో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ మొదలయ్యింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారిలో పదిమంది ఇప్పటికే గులాబీ గూటికి చేరిపోయారు. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. దీంతో 13మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలతో కూడిన విలీన లేఖను స్పీకర్‌కు అందజేసేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ మొదటివారంలో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈలోపే... స్పీకర్‌కు విలీన లేఖ ఇవ్వాలనే ఆలోచనలు చేస్తోంది అధికార పక్షం. శాసనసభ సమావేశాలకు ముందుగానే ఈ విలీన తంతును సీఎం కేసీఆర్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం

First published: April 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు