Sonia Gandhi: ఏఐసీసీ కీలక సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా కీలక వ్యాఖ్యలు.. వాళ్లకు నేరుగానే వార్నింగ్..

కాంగ్రెస్ కీలక సమావేశంలో సోనియా దిశానిర్దేశం

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఏఐసీసీ ముఖ్య నేతలతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆమె నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు వ్యక్తిగత వైషమ్యాలను పక్కనపెట్టి ఐక్యతతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె సూచించారు.

  • Share this:
    న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఏఐసీసీ ముఖ్య నేతలతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆమె నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు వ్యక్తిగత వైషమ్యాలను పక్కనపెట్టి ఐక్యతతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె సూచించారు.

    ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలపై, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సమష్టిగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అబద్ధపు ప్రచారాలను సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలని పార్టీ ముఖ్య నేతలకు సోనియా పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగననున్న నేపథ్యంలో నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇంఛార్జిలకు దిశానిర్దేశం చేశారు.

    ఇది కూడా చదవండి: అల్లుడి సొమ్ముపై అత్తకూ హక్కుంటుంది -సుప్రీంకోర్టు సంచలన తీర్పు -ఇదీ కేసు..

    అయితే.. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ముఖ్య నేతల కుమ్ములాటలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల మధ్య సఖ్యత కొరవడిందని, నేతలు వ్యక్తిగతంగా పైచేయి సాధించే ఆలోచనలను పక్కన పెట్టి పార్టీ ఉన్నతికి కృషి చేయాలని ఆమె సూచించినట్లు తెలిసింది. జిల్లా స్థాయిల్లో కేడర్‌కు పార్టీపై విశ్వాసం సన్నగిల్లేలా రాష్ట్ర స్థాయి నేతలు నడుచుకోవద్దని, కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేయాలని సోనియా పిలుపునిచ్చారు. రానున్న కొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల నేతలు, పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆమె సూచించారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

    ఇది కూడా చదవండి: Bank Auctions: తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్న SBI.. తక్కువ ధరకే సొంతం చేసుకున్న ఛాన్స్.. వివరాలివే

    ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలతో సోనియా గాంధీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోనియాతో పాటు మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్, ప్రియాంకా వాద్రా, రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. పంజాబ్, ఛత్తీస్‌గర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతల మధ్య సఖ్యత కొరవడింది. పూటకో తంటా, రోజుకో గొడవతో ఆ రాష్ట్రాల్లో కొందరు రాష్ట్ర స్థాయి నేతలు వ్యవహరిస్తున్న తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పరిస్థితి మారకపోతే పార్టీ ప్రతిష్ట మసకబారడం ఖాయమని భావించిన సోనియా గాంధీ నేరుగానే కీలక హెచ్చరిక జారీ చేసినట్టు తెలిసింది. నేతలు తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సంకేతాలను సోనియా పంపారు.
    Published by:Sambasiva Reddy
    First published: