తల్లి, చెల్లితో కలిసి అమేథిలో రాహుల్ గాంధీ నామినేషన్..

గత ఎన్నికల్లోనూ రాహుల్‌ పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

news18-telugu
Updated: April 10, 2019, 2:01 PM IST
తల్లి, చెల్లితో కలిసి అమేథిలో రాహుల్ గాంధీ నామినేషన్..
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి ఉన్నవి రెండు సీట్లే. ఒకటి అమేథీ, రెండోది రాయ్ బరేలీ. ఆ రాష్ట్రంలో 80 లోక్ సభ స్థానాలు ఉండటంతో కాంగ్రెస్ వీలైనంత మందిని అక్కడ గెలిపించుకోవాలని చూస్తోంది.
  • Share this:
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అమేథిలో నామినేషన్ దాఖలు చేశారు. తల్లిసోనియాగాంధీ, సోదరి ప్రియాంక, బావ రాబర్ట్ వాద్రాతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమేథిలో కాంగ్రెస్ కార్యర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు.  గాంధీల కుటుంబానికి కంచుకోట అమేధిలో రాహుల్‌ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. నామినేషన్‌ వేసేముందు రాహుల్‌ 3 కిమీ పరిధిలో సాగే రోడ్‌షోలో పాల్గొన్నారు. మరోవైపు అమేధితో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేస్తున్న రాహుల్‌ ఇప్పటికే అక్కడ నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమేధిలో రాహుల్‌ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. గత ఎన్నికల్లోనూ రాహుల్‌ పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

First published: April 10, 2019, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading