కుప్పకూలిన కాంగ్రెస్ వేదిక... విజయశాంతికి తప్పిన ముప్పు
స్టేజ్‌పై విజయశాంతి, ఇతర కాంగ్రెస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కకు తృటిలో ప్రమాదం తప్పింది. అచ్చంపేట సభలో వీరిద్దరూ స్టేజ్‌పై ఉండగానే... స్టేజీ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న విజయశాంతికి తృటిలొ ప్రమాదం తప్పింది. పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, విజయశాంతి ఉండగా ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలింది. అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్టేజ్ మీద ఉన్న నేతలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రచార వేదికపై మాట్లాడేందుకు వచ్చిన విజయశాంతి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారికి కిందపడిపోయారు. అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు వెంటనే విజయశాంతిని పైకి లేపారు. అయితే ఎవరికీ ఏం కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. వేదిక ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం కారణంగా తమ దిష్టి పోయిందని పలువురు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.