కాంగ్రెస్ పార్టీ సూసైడ్ వివాదం.. ఆర్టికల్ 370 రద్దుపై సీడబ్ల్యూసీ సమావేశం..

CWC Meeting : ఆజాద్ ఒకలా.. ఇద్దరు సీనియర్ నేతలు మరోలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వాన్ని ఇరుకున పడేసింది. నేతలంతా ఒకే వాయిస్ వినిపించే దిశగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 6, 2019, 1:37 PM IST
కాంగ్రెస్ పార్టీ సూసైడ్ వివాదం.. ఆర్టికల్ 370 రద్దుపై సీడబ్ల్యూసీ సమావేశం..
సోనియా గాంధీ, రాహుల్, మన్మోహన్ సింగ్ (ఫైల్)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 6, 2019, 1:37 PM IST
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడంతో విపక్షాలు ఆత్మరక్షణలో పడిపోయాయి. ఓటు బ్యాంకు పోతుందని కొన్ని పార్టీలు, దేశం మీద ఉన్న ప్రేమతో మరికొన్ని పార్టీలు.. ఆ నిర్ణయాన్ని స్వాగతించాయి. కొన్ని పార్టీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. అందులో కీలక పార్టీ.. కాంగ్రెస్. ఆ పార్టీ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది. గులాం నబీ ఆజాద్ పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. దేశ రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. అయితే, ఆ పార్టీలోనే కొందరు ఎంపీలు ఆర్టికల్ రద్దును స్వాగతించారు. దేశ రక్షణకు సంబంధించిన అంశం అయినందున ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బహిరంగంగానే ప్రకటించారు. రాజ్యసభలో ఆ పార్టీ విప్ భువనేశ్వర్ ఖలిటా ఆర్టికల్ 370 రద్దుపై పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. విప్ జారీ చేయాలన్న అధిష్ఠాన్ని ధిక్కరించి.. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ సూసైడ్ చేసుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆ పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది కూడా ఆర్టికల్ 370 చారిత్రక తప్పిదం అని, దాన్ని ఇప్పుడు సరి చేశారని వ్యాఖ్యానించారు. అయితే, ఒకే పార్టీకి చెందిన ఆజాద్ ఒకలా.. ఇద్దరు సీనియర్ నేతలు మరోలా మాట్లాడటం పార్టీ అధి నాయకత్వాన్ని ఇరుకున పడేసింది. నేతలంతా ఒకే వాయిస్ వినిపించే దిశగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోనియాగాంధీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఆర్టికల్ 370 రద్దుపై పార్టీ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశానికి పిలుపునిచ్చింది.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...