కాంగ్రెస్ చరిత్రలోనే చెత్త ఓటమి.. 63 మంది డిపాజిట్లు గల్లంతు

గతంలో షీలా దీక్షిత్ నేత‌ృత్వంలో మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అసెంబ్లీలో జీరోకు పరిమితమవడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించులేకపోతున్నాయి.


Updated: February 11, 2020, 7:15 PM IST
కాంగ్రెస్ చరిత్రలోనే చెత్త ఓటమి.. 63 మంది డిపాజిట్లు గల్లంతు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని కైవం చేసుకుంది. మొత్తం 70 సీట్లలో 62 స్థానాలు గెలిచి తమకు తిరుగులేని నిరూపించింది. ఇక విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ 8 స్థానాల వద్దే ఆగిపోయింది. ఇక మిగిలిన పార్టీల్లో ఎవరూ ఖాతా తెరువలేకపోయారు. ఐతే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రదర్శన హాట్ టాపిక్‌గా మారింది. వరసగా రెండో అసెంబ్లీ ఎన్నికల్లోనూ సున్నాకే పరిమితమైంది. ఆ పార్టీ నుంచి కనీసం ఒక్కరు కూడా గెలవలేకపోయారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీ ఎన్నికల్లో కనివినీ ఎరుగని చెత్త ఓటమిని మూటగట్టుకుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 5శాతం లోపే ఓట్లు పడ్డాయి. కనీసం 5శాతం ఓట్లు కూడా పడలేదంటే హస్తినలో హస్తం పార్టీ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున 66 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో ఏకంగా 63 మందికి డిపాజిట్లు దక్కలేదు. కేవలం ముగ్గురు మాత్రమే డిపాజిట్లు సాధించారు. అర్విందర్ సింగ్ లవ్లీ (గాంధీ నగర్), దేవేందర్ యాదవ్ (బద్లి), అభిషేక్ దత్ (కస్తూర్బా నగర్)కు మాత్రమే డిపాజిట్లు దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో చాలా మందికి 5శాత లోపే ఓట్లు పోలయ్యాయి.

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా కూతురు శివాని చోప్రా, ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రి కూతురు ప్రియాంక సింగ్‌కు సైతం డిపాజిట్ దక్కలేదు. ఇక కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఆజాద్‌కు కేవలం 2604 (2.23శాతం) ఓట్లు మాత్రమే పడ్డాయి. గతంలో షీలా దీక్షిత్ నేత‌ృత్వంలో మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అసెంబ్లీలో జీరోకు పరిమితమవడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించులేకపోతున్నాయి.First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు