ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ మద్దతు : భట్టి విక్రమార్క

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యతో సమ్మె మరో మలుపు తీసుకుంది. ఆందోళనలను ఉద్యమం తరహాలో సాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.

news18-telugu
Updated: October 13, 2019, 2:56 PM IST
ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ మద్దతు : భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క (File)
  • Share this:
ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ పిలుపిచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటిస్తున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన సీఎం కేసీఆర్.. వాటిని తన అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను తోకలని సంబోధించడం.. కుక్కలతో పోల్చడం దారుణమన్నారు. కేసీఆర్ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యతో సమ్మె మరో మలుపు తీసుకుంది. ఆందోళనలను ఉద్యమం తరహాలో సాగించాలని ఆర్టీసీ జేఏసీ

నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ జనసమితి ఛైర్మన్ కోదండరాం నేత్రుత్వంలో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. ఈ నెల 13న అన్ని డిపోల ఎదుట వంటావార్పు, 14న కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో డిపోల ముందు బైఠాయింపు,ధర్నాలు,15న రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారులపై రాస్తారోకో,16న అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు ర్యాలీలు,17న ధూం ధాం,18న బైక్ ర్యాలీలు నిర్వహించాలని చేపట్టారు.
Published by: Srinivas Mittapalli
First published: October 13, 2019, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading