కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అదిర్ రంజన్ చౌదరిని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేతగా నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమైన రాహుల్ గాంధీ... లోక్ సభలో పార్టీకి నాయకత్వం వహించే విషయంలోనూ ఆసక్తి చూపలేదు. దీంతో మరో నాయకుడిని కాంగ్రెస్ లోక్సభాపక్షనేతగా నియమించకతప్పని పరిస్థితి నెలకొంది. ఇందుకోసం శశిథరూర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. అయితే చివరకు ఇందుకోసం అదిర్ రంజన్‌ను ఎంపిక చేశారు సోనియగాంధీ.
ఎవరీ అదిర్ రంజన్ చౌదరి
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న అదిర్ రంజన్ చౌదరి... బెరహంపొరె నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 1999 నుంచి ఇప్పటివరకు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న అదిర్ రంజన్ చౌదరి... సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకత్వం లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా అదిర్ రంజన్ చౌదరికి అవకాశం కల్పించారు. గత లోక్‌సభలో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేతగా కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Published by:Kishore Akkaladevi
First published:June 18, 2019, 19:36 IST