కాళేశ్వరం చూసి కాంగ్రెస్‌, బీజేపీ కడుపు మండుతోంది: ఎమ్మెల్యే బాల్క సుమన్

కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం కావడాన్ని కాంగ్రెస్ ,బీజేపీ నేతలు ఓర్చుకొలేక పోతున్నారని... వారి కడుపు మండుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: June 19, 2019, 3:21 PM IST
కాళేశ్వరం చూసి కాంగ్రెస్‌, బీజేపీ కడుపు మండుతోంది: ఎమ్మెల్యే బాల్క సుమన్
టీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాల్క సుమన్
  • Share this:
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలను టీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం కావడాన్ని కాంగ్రెస్ ,బీజేపీ నేతలు ఓర్చుకొలేక పోతున్నారని... వారి కడుపు మండుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,బీజేపీ నేత లక్ష్మణ్ సీఎం కేసీఆర్‌పై చేసిన విమర్శలను ఆయన ఖండించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత శరవేగంగా కట్టిన ప్రాజెక్టు ఏదయినా ఉందేమో లక్ష్మణ్ చెప్పాలని బాల్క సుమన్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నయా పైసా ఇవ్వలేదని కేసీఆర్ నిజం చెబితే బీజేపీకి ఎందుకు ఉలికి పాటు ? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి అవగాహన లేకే కాళేశ్వరం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుమన్ ఆరోపించారు. ఆయకట్టు భారీగా పెరిగింది కనుకే అంచనా వ్యయం పెరిగిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నీళ్లు త్వరలోనే వస్తాయని...ఇక కాంగ్రెస్, బీజేపీ నేతలకు కన్నీళ్లు తప్పవని అన్నారు. అపర భగీరథుడు కెసిఆర్ ను తెలంగాణ రైతులు ఎపుడూ గుండెల్లో పెట్టుకుంటారని సుమన్ తెలిపారు. రామేశ్వరం పోయినా శనీశ్వరులు తప్పరన్నట్టుగా...కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చే సందర్భంలో కాంగ్రెస్ ,బీజేపీ శనీశ్వరుల మాటలు వినక తప్పడం లేదని విమర్శించారు. కొత్త సచివాలయం ,అసెంబ్లీ కట్టుకోవడం కూడా తప్పే అన్నట్టు కాంగ్రెస్ ,బీజేపీ నేతలు మాట్లాడుతుండటం దుర్మార్గమని సుమన్ అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సచివాలయం ,అసెంబ్లీ ఉండటం మన రాష్ట్రానికి గర్వకారణమని సుమన్ తెలిపారు.


First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు