సీఎం కాన్వాయ్‌లో రూ.1.8 కోట్లు సీజ్.. 'ఓటుకు నోటు'పై రాజకీయ రచ్చ

21 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో రూ.60వేల కోట్లు ఖర్చు అయింది.

మోదీ పర్యటన వేళ ఈ వ్యవహారం అరుణాల్ ప్రదేశ్ రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. డబ్బులతో ఓట్లను కొంటోందని బీజేపీపై మండిపడుతోంది కాంగ్రెస్. ఎన్నికలకు వారం రోజుల ముందుజరిగిన ఈ ఘటన బీజేపీకి ఇబ్బందిగా మారింది.

 • Share this:
  ప్రధాని మోదీ పర్యటన వేళ అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో 'ఓటుకు నోటు' వ్యవహారం సంచలనం రేపుతోంది. సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాపిర్ గావ్ ప్రయాణించిన కాన్వాయ్‌లో భారీ మొత్తంలో డబ్బులు పట్టుబడ్డాయి. రెండు కార్ల నుంచి రూ.1.8 కోట్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడీ వ్యవహారం అరుణాచల్‌తో పాటు దేశ రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. మోదీ సభకు హాజరయ్యే జనాలకు పంచేందుకే డబ్బులను తరలించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

  బీజేపీ నేతల కాన్వాయ్‌లో భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్నట్లు మంగళవారం రాత్రి కాంగ్రెస్ నేతలకు సమాచారం అందింది. దాంతో ఓ కార్యకర్త అరుణాల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్‌ని ఫాలో అయ్యాడు. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వడంతో అధికారులు సైతం వెంబడించారు. చివరకు ఆ వాహనాల శ్రేణి పాసీఘాట్‌లోని సియాంగ్ గెస్ట్‌హౌజ్‌కు చేరింది. అధికారుల చేరుకొని కాన్వాయ్‌లోని కార్లన్నింటినీ తనిఖీ చేశారు. మెబో నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దంగీ పెర్మి కారులో రూ.కోటి రూపాయలు దొరికాయి. డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ ఉపయోగిస్తున్న రవాణాశాఖకు చెందిన కారులో మరో. 80 లక్షలు పట్టుబట్టాయి. ఆ సమయంలో సీఎం పెమాఖండు, డిప్యూటీ సీఎం చౌనా గెస్ట్‌హౌజ్‌లోనే ఉన్నారు.

  ఏకంగా సీఎం కాన్వాయ్‌లో భారీ మొత్తంలో డబ్బులు పట్టుబడడంతో కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇవాళ పాసిఘాట్‌లో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆ సభకు హాజరయ్యే జనాలకు పంచేందుకే డబ్బులు తరలించారని ఆరోపిస్తోంది. ఎన్నికలు కోడ్ ఉల్లంఘిస్తూ దొరికినా ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

  అరుణాచల్ ప్రదేశ్‌లో సంచలనాత్మక ఓటుకు నోటు వ్యవహారం బయటపడింది. సీఎం పెమాఖండు, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ కాన్వాయ్‌లో రూ.1.8 కోట్లు దొరికాయి. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
  రణ్‌దీప్ సూర్జివాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
  ఐతే కాంగ్రెస్ ఆరోపణలను అరుణాచల్ సీఎం పెమా ఖండు తిప్పికొట్టారు. ఓటుకు నోట్లిచ్చే బుద్ధి తమకు లేదని... కాంగ్రెస్ నేతలే ఆ పనులు చేస్తారని ఎదురుదాడికి దిగారు. బీజేపీ కార్యకర్తకు చెందిన కారులో డబ్బులు దొరికాయి...ఆ డబ్బులతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. అటు డిప్యూటీ సీఎం సైతం కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు.

  ఆ డబ్బులు మెబో బీజేపీ అభ్యర్థి దండీ పర్మీ, మాజీ ఎమ్మెల్యేకు చెందినవి. వాటితో సీఎంకు గానీ, నాకు గానీ సంబంధం లేదు. అవి బీజేపీకి చెందిన డబ్బులు కావు. ఎన్నికల సంఘం విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి.
  చౌనా మెయిన్, డిప్యూటీ సీఎం

  కాగా, మోదీ పర్యటన వేళ ఈ వ్యవహారం అరుణాల్ ప్రదేశ్ రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. డబ్బులతో ఓట్లను కొంటోందని బీజేపీపై మండిపడుతోంది కాంగ్రెస్. ఎన్నికలకు వారం రోజుల ముందుజరిగిన ఈ ఘటన బీజేపీకి ఇబ్బందిగా మారింది.

  క్యాష్ సీజ్ వీడియో ఇక్కడ చూడండి:


  ఇది కూడా చూడండి :-
  First published: