కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

కాంగ్రెస్‌ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని అక్బర్ రోడ్‌లో ఉన్న ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు.

news18-telugu
Updated: December 28, 2019, 4:29 PM IST
కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న సోనియా గాంధీ
  • Share this:
కాంగ్రెస్‌ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని అక్బర్ రోడ్‌లో ఉన్న ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, మోతీలాల్‌ వోరా, ఎకె ఆంటొని తదితర నేతలు పాల్గొన్నారు. '135 ఏళ్ల ఐక్యత,135 ఏళ్ల అహింస,135 ఏళ్ల సమానత్వం,135 ఏళ్ల న్యాయం,135 ఏళ్ల స్వేచ్చ.. అన్నీ కలిపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం' అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పేర్కొంది. 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్‌ఆర్‌సీ,సీఏఏలకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Published by: Srinivas Mittapalli
First published: December 28, 2019, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading