సీఎం రేసులో లేను.. అధిష్టానానిదే తుదినిర్ణయం: జైపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. పదవులను ఆశించేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందులో భాగంగానే, కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై మరోసారి ఆసక్తి నెలకొంది. తాను మాత్రం ఆ రేసులో లేనంటున్నారు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి.

news18-telugu
Updated: November 24, 2018, 10:00 PM IST
సీఎం రేసులో లేను.. అధిష్టానానిదే తుదినిర్ణయం: జైపాల్ రెడ్డి
జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
news18-telugu
Updated: November 24, 2018, 10:00 PM IST
ఓ వైపు టీఆర్ఎస్, మరోవైపు ప్రజాకూటమి. టీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆరే అని అందరికీ తెలిసిందే. మరి కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడీ ప్రశ్న ప్రజల్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ మెదులుతోంది. నేతల ప్రకటనలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అనగానే చాలామంది నేతలు సీఎం రేసులో ఉంటారు. ఆ రేసులో తాను మాత్రం లేనని ప్రకటించారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, అధికారంలోకి రావడమే ప్రథమ లక్ష్యమని చెప్పారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఉత్తర తెలంగాణలో పూర్తి మెజార్టీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న ప్రతిపక్షాల నుంచే కాదు, సాధారణ ప్రజల్లోనూ మెదలుతోంది. అయితే ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారి లిస్టులో జైపాల్‌రెడ్డి పేరు కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన జైపాల్.. ముఖ్యమంత్రిని అధిష్టానమే నిర్ణయిస్తుందని క్లారిటీ ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్.. తనకు కూడా పరిపాలనా దక్షత ఉందని ప్రకటించడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేసులో చాలామంది ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై స్పందించిన జైపాల్ రెడ్డి.. అలాంటిదేం లేదని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు.

First published: November 24, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...