తెలంగాణ కాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్... తేల్చుకోలేకపోతున్న నేతలు

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో కారణంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్‌ జిల్లాలు నీటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుందని... కాబట్టి దీనిపై పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: May 12, 2020, 6:53 PM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్... తేల్చుకోలేకపోతున్న నేతలు
తెలంగాణ కాంగ్రెస్
  • Share this:
కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 203 అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తోంది. సీఎం కేసీఆర్ ఉదాసీనత వల్లే ఏపీ ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటోందని విమర్శిస్తోంది. దీనిపై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫిరెన్స్‌లో మాత్రం నేతలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో కారణంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్‌ జిల్లాలు నీటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుందని... కాబట్టి దీనిపై పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వలస కార్మికులు, కరోనా అంశమే పార్టీ ప్రధాన అంశం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఈ అంశంపై పోరాటానికి దిగుతుందా లేక మరికొంతకాలం ఎదురుచూస్తుందా అన్నది చూడాలి.
Published by: Kishore Akkaladevi
First published: May 12, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading