కేటీఆర్‌పై పొగడ్తలు, హరీశ్‌పై విమర్శలు.. జగ్గారెడ్డి వ్యూహం ఏమిటో?

కేసీఆర్ ఫ్యామిలీపై పదునైన విమర్శలు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న జగ్గారెడ్డి అలియాస్ జయప్రకాశ్ రెడ్డి.. ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. టీఆర్ఎస్ గాలిలోనూ సంగారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగరేసిన ఆయన.. కొంతకాలంగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటున్నారు. కానీ, తాజాగా తన మార్క్ స్టైల్లో విరుచుకుపడుతున్నారు.

Santhosh Kumar Pyata | news18-telugu
Updated: February 13, 2019, 8:23 PM IST
కేటీఆర్‌పై పొగడ్తలు, హరీశ్‌పై విమర్శలు.. జగ్గారెడ్డి వ్యూహం ఏమిటో?
జగ్గారెడ్డి, కేటీఆర్, హరీశ్‌రావు
  • Share this:
తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంతో... ప్రతిపక్ష కాంగ్రెస్ డీలా పడిపోయింది. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు సైతం ఓడిపోవడంతో.. క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోయింది. ఇంతటి వ్యతిరేకతలోనూ సంగారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగరేసిన ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి కూడా అధికారం టీఆర్ఎస్‌కు దక్కడంతో సైలెంటైపోయారు. కేసీఆర్ ఫ్యామిలీపై ఇకమీదట విమర్శలు చేయబోనని ప్రకటించారు. పార్టీ మారబోనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు.  అయితే ఈ మధ్య జగ్గారెడ్డి ఎవరికీ అంతుపట్టని వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అదేమిటో రాజకీయవిశ్లేషకులకు సైతం అంతుపట్టని పరిస్థితి నెలకొంది.

jaggareddy on harishrao, harish rao, jaggareddy on ktr, jaggareddy on kcr, trs, telangana congress, హరీశ్‌రావుపై జగ్గారెడ్డి ఫైర్, కేటీఆర్‌పై జగ్గారెడ్డి పొగడ్తలు, కేసీఆర్‌పై జగ్గారెడ్డి కామెంట్స్, టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్
కేసీఆర్, జగ్గారెడ్డి ఫైల్


కేసీఆర్‌ను ఇకమీదట విమర్శించబోనన్న జగ్గారెడ్డి... టీఆర్ఎస్‌లో కీలకనేతలుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌రావులపై భిన్నంగా కామెంట్స్ చేస్తూ ఆసక్తి రేపుతున్నారు. ఇటీవల కేటీఆర్‌ను ఫెయిర్ అంటూ ప్రశంసలు కురిపించిన జగ్గారెడ్డి.. హరీశ్‌రావు బ్లాక్‌మెయిలర్ అంటూ విమర్శలు గుప్పించారు. అది మరిచిపోక ముందే, మరోసారి హరీశ్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు జగ్గారెడ్డి. సాగునీటి మంత్రిగా ఉన్నప్పుడు హరీశ్‌రావు మంజీరాబ్యారేజ్‌‌లో డెడ్ స్టోరేజ్ నీరు కూడా ఉంచకుండా.. మొత్తం శ్రీరామ్‌సాగర్‌కు తరలించారంటూ మండిపడ్డారు. అయితే, ఈ విషయంలో కేసీఆర్ తప్పేమీ లేదని, ఆయనకు తెలియకుండానే హరీశ్ నీటి దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు.

jaggareddy on harishrao, harish rao, jaggareddy on ktr, jaggareddy on kcr, trs, telangana congress, హరీశ్‌రావుపై జగ్గారెడ్డి ఫైర్, కేటీఆర్‌పై జగ్గారెడ్డి పొగడ్తలు, కేసీఆర్‌పై జగ్గారెడ్డి కామెంట్స్, టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్
జగ్గారెడ్డి, హరీశ్ రావు(ఫైల్ ఫోటో)


జగ్గారెడ్డి ఓవైపు కేసీఆర్, కేటీఆర్‌లను ప్రశంసిస్తూ... హరీశ్‌రావును విమర్శించడం వెనక ఆంతర్యమేమిటో రాజకీయవర్గాలకు అంతుచిక్కడం లేదు. జగ్గారెడ్డి ప్లాన్ ఏంటో తెలియక కాంగ్రెస్ వర్గాలూ అయోమయానికి గురవుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో ఏదో రాజకీయ ముసలం పుట్టిందని.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు జగ్గారెడ్డి ఇలాంటి వ్యూహాన్ని ఫాలో అవుతున్నారనే టాక్  వినబడుతోంది.

jaggareddy on harishrao, harish rao, jaggareddy on ktr, jaggareddy on kcr, trs, telangana congress, హరీశ్‌రావుపై జగ్గారెడ్డి ఫైర్, కేటీఆర్‌పై జగ్గారెడ్డి పొగడ్తలు, కేసీఆర్‌పై జగ్గారెడ్డి కామెంట్స్, టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)


ఇక, హరీశ్‌రావుపై జగ్గారెడ్డి అంతలా విమర్శలు చేసినా టీఆర్ఎస్ పార్టీ తరపున ఏ ఒక్కరూ ఖండించలేదు. దీంతో, రాజకీయంగా హరీశ్‌రావును దెబ్బకొట్టేందుకు జగ్గారెడ్డిని టీఆర్ఎస్సే వెనకుండి నడిపిస్తోందనే అభిప్రాయం కూడా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కేటీఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం ద్వారా.. భవిష్యత్తులో టీఆర్ఎస్‌లో చేరినా తాను ఆయన వర్గమేనని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్టుగానూ భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇది కూడా చూడండి:
Published by: Santhosh Kumar Pyata
First published: February 13, 2019, 8:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading