Andhra Pradesh: మరో వివాదంలో అంబటి రాంబాబు.. మహిళలను తొక్కుకుంటూ వెళ్లారని ఫిర్యాదు

అంబటి రాంబాబుపై ఫిర్యాదు

వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు అంబటి రాంబాబు.. తాజాగా మహిళలను తొక్కుకుంటూ వెళ్లారంటూ ఆయనపై సీపీఎం నేతలు ఫిర్యాదు చేశారు..

  • Share this:
    వైసీపీ ఫైర్ బ్రాండ్ ల్లో ఒకరైన అంబటి రాంబాబు తరచూ వివాదాల్లో ఇరుకుంటున్నారు. ఇటీవల ఒక సమాజిక వర్గాన్నికించపరిచారనే ఆరోపణలు రావడంతో.. వెనక్కు తగ్గి ఆయనే క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తీరు ప్రస్తుతం సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఆస్తి, చెత్తపన్ను పెంపుకు నిరసనగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో మున్సిపల్ ఆఫీసు మెట్లకు అడ్డంగా బైఠాయించి సీపీఎం నేతలు ధర్నాకు దిగారు. అప్పుడే కౌన్సిల్ హాల్ కు వచ్చిన అంబటిని సీపీపీ కార్యకర్తలు నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్తి, చెత్త పన్నుల పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు లోనికి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో కాసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో ఆవేశానికి గురైన ఆయన ఏం ఆలోచించకుండా వారిని నెట్టుకుంటూనే మెట్లపైకి ఎక్కారు..

    సమస్యలపై పోరాటం చేస్తున్న వారు నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా.. సీపీఎం నేతలను తొక్కుకుంటూ అంబటి రాంబాబు కౌన్సిల్ హాల్లోకి వెళ్లిపోయారు. దీంతో అంబటి రాంబాబు తీరుపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే విధులకు ఆటంకం కలిగించారనే కారణంగా ధర్నాకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు స్టేషన కు తరలించారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

    ఎమ్మెల్యే తీరుతో షాక్ తిన్న ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే అంబటి.రాంబాబు తోపాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్స్ పై తమపై దాడిచేసికోట్టి,అసభ్యంగా దూషించారని ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ భర్త చల్లంచర్ల సాంబశివరావు మరికొంతమంది వైయస్సార్ సిపి కౌన్సిలర్లు సత్తెనపల్లి మున్సిపల్ ఆఫీసు వద్ద ఆస్థిపన్ను ఉపసంహరించాలని ఆందోళన చేస్తున్న తమపై మహిళలనే గౌరవం లేకుందా,అసభ్యంగా దూషిస్తూ, దాడి చేసి కోట్టిగాయపరిచారని సత్తెనపల్లి పట్టణ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు సిపిఎం పట్టణ కార్యదర్శి థరణికోట విమల.
    Published by:Nagesh Paina
    First published: