అక్బరుద్దీన్ ఓవైసీపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కరీంనగర్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: July 26, 2019, 1:28 PM IST
అక్బరుద్దీన్ ఓవైసీపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
అక్బరుద్దీన్ (File)
  • Share this:
కరీంనగర్‌లో ఎంఐఎం ముఖ్యనేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు ఇరువర్గాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కరీంనగర్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు... మహబూబ్ నగర్ టూ టౌణ్ పోలీస్ స్టేషన్‌లోనూ అక్బరుద్దీన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. తాజాగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో పర్యటించిన అక్బరుద్దీన్ ఓవైసీ...నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన ముస్లింలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
First published: July 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading